బిగ్ బాస్ తెలుగు ఓటిటి మొదలు కావడానికి కేవలం పది రోజుల టైం మాత్రమే ఉంది. బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన రెండు నెలల గ్యాప్ లో బిగ్ బాస్ ఓటిటి వచ్చేస్తుంది. హాట్ స్టార్ లో 24 గంటలు చూసే అవకాశం ఉండడంతో.. బుల్లితెర ప్రేక్షకులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే గత రెండు సీజన్స్ లో పెద్ద పేరున్న సెలబ్రిటీస్ ఎవరూ బిగ్ బాస్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిన దాఖలాలు లేవు. దానితో సీరియల్ ఆర్టిస్ట్ లు, యూట్యూబ్ స్టార్స్ తో నెట్టుకొచ్చేసారు. అయితే ఈసారి బిగ్ బాస్ ఓటిటి లో 24 గంటల పార్టిసిపేట్ చేసినందుకు గాను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి బాగానే పారితోషకాలు ఆఫర్ చెయ్యడంతో హౌస్ లోకి వెళ్లేందుకు పాత కంటెస్టెంట్స్ తో పాటుగా.. కొత్తవారు ఆసక్తిగా ఉన్నారట.
ఇప్పటికే కొన్ని సీజన్స్ లో పాల్గొన్న వారిలో ధనరాజ్, ముమైత్‌ఖాన్, తేజస్వి, అరియానా, అఖిల్ సార్ధక్, అషు రెడ్డి, హమిదా, సరయూ, నటరాజ్ మాస్టర్ లు ఉండగా.. కొత్తగా శ్రీ రాపాక, స్రవంతి చోకవరపు, అజయ్‌కత్యా, మౌనికా రెడ్డి, అనిల్ రాథోడ్, వర్ష , మిత్రాశర్మ, ఆర్.జె.చైతూ లు బిగ్ బాస్ ఓటిటిలోకి అడుగుపెడతారని.. ఫైనల్ గా ఇందులో ఇద్దరు ముగ్గురు వెళ్లకపోయినా మిగతా కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లడం పక్కా అని తెలుస్తుంది. ఇక వీరిని ఓ వారం పాటు క్వారంటైన్ కి పంపి హౌస్ లోకి ఈనెల 26 న గ్రాండ్ గా పంపుతారని తెలుస్తుంది.