కొత్త బంగారు లోకం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సాఫ్ట్ సినిమాలు చేసిన శ్రీకాంత్ అడ్డాలా వెంకటేష్ తో నారప్ప సినిమా చేసి తాను మాస్ సినిమాలు కూడా డీల్ చెయ్యగలను అని, కమర్షియల్ అవుట్ ఫుట్ ఇవ్వగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. నారప్ప సినిమా ప్రమోషన్స్ టైం లోనే తన దగ్గర అన్నాయ్ అనే అద్భుతమైన స్క్రిప్ట్ ఉంది అని, ఓ పెద్ద హీరో తో పాన్ ఇండియా మూవీ చెయ్యాలని అనుకుంటున్నాను అని ప్రకటించిన అడ్డాలా.. నారప్ప తర్వాత అదే స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నారు. పకడ్బందీగా కథను సిద్ధం చేసుకున్నారు.
రీసెంట్ గా ఆ కథ విన్న దిల్ రాజు ఇది బాలయ్య మీద అయితే బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది అని కితాబునిచ్చారట. ఆల్రెడీ ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి అని తెలుస్తుంది. అఖండ లాంటి అద్భుత విజయంతో ఫామ్ లోకి వచ్చేసిన బాలయ్య కోసం ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ అందరూ పోటీ పడడం విశేషం. ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తుంటే అనిల్ రావిపూడి కథ సిద్ధం చేసుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్ బాలయ్య తోనే అంటూ ఉవ్విళ్లూరుతున్నాడు. ఆ తర్వాత సంపత్ నంది కూడా బాలయ్య తో సినిమా కోసం మిర్యాల రవీంద్ర రెడ్డి అనే ప్రొడ్యూసర్ ద్వారా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇక జనగణమన ప్రాజెక్ట్ తర్వాత పూరి తో బాలయ్య సినిమా ఎలాగూ ఉండనే ఉంది. ఆ తర్వాత లైన్ లోకి బోయపాటి రానే వస్తాడు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి శ్రీకాంత్ అడ్డాల కూడా జాయిన్ అయ్యాడు. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే లేటు చక చకా సినిమాలు రెడీ అయిపోతానే ఉంటాయి.