Advertisement
Google Ads BL

పెళ్లి వయసు రాలేదంటున్న రష్మిక


కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కెరీర్ ఆరంభంలోనే హీరో రక్షిత్ ని ప్రేమించి నిశ్చితార్ధం కూడా చేసుకుంది. ఆ తర్వాత తెలుగులో సక్సెస్ అవడంతో ఆ ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకుని కెరీర్ ని ఎంచుకుంది. అప్పటినుండి రష్మిక వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజెస్ తో రష్మిక బిజీగా మారింది. మధ్యలో స్టార్ హీరో అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ చేసింది. ప్రస్తుతం లక్కీ హీరోయిన్ గా రష్మిక కెరీర్ ఆరు సినిమాలు, మూడు రిలీజ్ లా ఉంది. అయితే తనకి మంచి హిట్స్ అందించిన విజయ్ దేవరకొండ తో రష్మిక లవ్ లో ఉందనే ప్రచారం జరిగినా.. ఇద్దరూ ఆ రూమర్స్ ని ఖండించారు.

Advertisement
CJ Advs

రీసెంట్ గా ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ప్రమోషన్స్ లో రష్మిక ప్రేమ, పెళ్లిపై తన అభిప్రాయాలని చెప్పింది. ఎవరితో అయితే మనం సెక్యూర్ గా, హ్యాపీ గా ఫీల్ అవుతామో వారిని మాత్రమే ప్రేమించాలి. ప్రేమను వర్ణించడం కష్టం, ఎందుకంటే ప్రేమ అంటేనే ఫీలింగ్స్. ప్రేమ ఇద్దరిలో ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది, ఒకరిలో ప్రేమ ఉండి.. మరొకరిలో ప్రేమ లేకపోతే అది బాగోదు. ఇక పెళ్లి విషయానికి వస్తే.. పెళ్లి గురించి నేను ఏమి చెప్పలేను. అసలు పెళ్లి ఆలోచనే నాలో లేదు. ఎందుకంటే నాకింకా పెళ్లి వయసు రాలేదు.. అని నేను అనుకుంటున్నా. పెళ్లి గురించి చెప్పాలంటే నేను ఎవరితో అయితే కంఫర్ట్ గా ఫీలవుతానో అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఎవరైనా అలాంటి వారినే చూజ్ చేసుకుంటారు అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. 

Rashmika Mandanna opens up on love, marriage:

Rashmika Mandanna: I am too young for marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs