Advertisement
Google Ads BL

భాయ్ తప్పుకున్నాడు.. బోయ్ వచ్చాడు


ఏప్రిల్ 14న కెజిఎఫ్ 2 తో బాక్సాఫీసు దగ్గర తలపడాల్సిన లాల్ సింగ్ చద్దా ఆదిపురుష్ మేకర్స్ ని బ్రతిమిలాడుకుని మరీ ఆగష్టు 11కి షిఫ్ట్ అయ్యాడు. ఏప్రిల్ 14 నుండి అమీర్ భాయ్ తప్పుకోగానే.. షాహిద్ బోయ్ ఎంటర్ అయ్యాడు. షాయిద్ కపూర్ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కిన జెర్సీ మూవీ డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా అప్పుడు వాయిదాపడింది. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చెడ్డ రిలీజ్ ని ఆగష్టు11 కి మార్చడంతో షాహిద్ కపూర్ జెర్సీతో ఏప్రిల్ 14న డేట్ ఫిక్స్ చేసి కెజిఎఫ్ 2 తో ఫైట్ షురూ చేసాడు. 

Advertisement
CJ Advs

ఎలాంటి అంచనాలు లేకుండానే.. కెజిఎఫ్ తో ఇండియన్ బాక్సాఫీసుని గడగడలాడించిన యశ్ - ప్రశాంత్ నీల్ లు ఇప్పుడు కెజిఎఫ్ 2 తో భారీ అంచనాలతో రాబోతున్నారు. అటు చూస్తే కబీర్ ఖాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఉన్న షాహిద్ కపూర్ జెర్సీ పై విపరీతమైన అంచనాలున్నాయి. తెలుగులో మంచి హిట్ అందుకున్న జెర్సీ మూవీని షాహిద్ కపూర్ అదే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో హిందీలో రీమేక్ చేసారు. మరి ఇద్దరి క్రేజీ స్టార్స్ మధ్యన ఏప్రిల్ 14 ఫైట్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ ఇండియా వైడ్ ప్రేక్షకుల్లో మొదలయ్యింది. 

Jersey vs KGF 2:

Shahid Kapoor Jersey releasing on 14th April
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs