ముందు నుండి రెండు డేట్స్ లాక్ చేసి ఫాన్స్ ని కాస్త కన్ఫ్యూజ్ చేసి.. మళ్ళీ సర్ ప్రైజ్ చేస్తూ అర్ధరాత్రి భీమ్లా నాయక్ డేట్ ఇచ్చి మరీ ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. పాపం పవన్ రాడనుకుని, లేడనుకుని.. యంగ్ హీరోలు తమ సినిమాలని రేస్ లో దించిన టైం లోనే భీమ్లా నాయక్ సస్పెన్స్ కి తెర దించుతూ డేట్ అనౌన్స్ చేసారు. భారీ అంచనాలున్న భీమ్లా నాయక్ రిలీజ్ పై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అటు హిందీ నుండి గంగూభాయ్ కతీయవాడి, ఇటు తమిళ్ నుండి అజిత్ వాలిమై లాంటి సినిమాలు వస్తున్నా భీమ్లా నాయక్ నిర్మాతలు మాత్రం సినిమాపై ఉన్న నమ్మకంతో ఈ నెల 25 కే వచ్చేస్తున్నారు.
మరి అలా డేట్ ఇచ్చారో లేదో.. ఇలా ప్రమోషన్స్ షురూ చేసేసారు. ఇప్పటికే భీమ్లా నాయక్ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ లాలా భీమ్లా అంటూ ఓ ఊపు ఊపుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ స్పెషల్ వీడియో, రానా వీడియో అన్ని ఫాన్స్ కి విపరీతంగా ఎక్కేశాయి. ఇక ఈ పది రోజుల్లో టీం ఇంటర్వూస్, ప్రీ రిలీజ్ ఈవెంట్, భీమ్లా నాయక్ ట్రైలర్ లాంటి భారీ ప్రమోషన్స్ ఉండబోతున్నాయి. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అప్పుడే ఏర్పాట్లు స్టార్ట్ అయ్యాయి కూడా. ఈ నెల 20 సాయంత్రం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ తో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఏర్పాట్లు మొదలైపోయాయి. ఈ ఈవెంట్ కి పవన్ ఫాన్స్ భారీగా హాజరవుతారని, ఈవెంట్ నిర్వాహకులు కూడా ఫాన్స్ కోసం పోలీస్ ల వద్ద పర్మిషన్ తీసుకోబోతున్నారట. సో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సగం హిట్ కొట్టెయ్యాలనే ప్లాన్ తో మేకర్స్ ఉన్నారు.