నిన్నటివరకు ఫిబ్రవరి 25న బాక్సాఫీసు వార్ పై నార్మల్ గా మట్లాడుకునే వారు. కానీ అకస్మాత్తుగా వచ్చిన భీమ్లా నాయక్ సునామీని చూసి ఇప్పుడు చిన్న సినిమాలకు ఎటు పాలు పోవడం లేదు. భీమ్లా నాయక్ రాదు అనుకుని శర్వానంద్ తన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లని ని ఈ నెల 25 నే రిలీజ్ చెయ్యడానికి రెడీ అవ్వగా, మరో కుర్ర హీరో కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ కూడా ఫిబ్రవరి 25 కే వస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే బాబాయ్ రాడని గట్టి నమ్మకంతో వరుణ్ తేజ్ కూడా ఫిబ్రవరి 25 నే గని రిలీజ్ అంటూ ప్రకటించారు. తీరా చూస్తే రాత్రికి రాత్రే భీమ్లా నాయక్ డేట్ వచ్చేసి టెంక్షన్ పెట్టేసింది.
దానితో వరుణ్ తేజ్ గని, కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ సినిమాలని వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఆడవాళ్లు మాత్రం తగ్గేదే లే అంటున్నారు. శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు ఖచ్చితంగా ఫిబ్రవరి 25 నే రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే భీమ్లా నాయక్ డేట్ ఇచ్చినా తొణకడం లేదు. భీమ్లా నాయక్ మాస్ సినిమా మాది క్లాస్ సినిమా అందులోనూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే కాన్ఫిడెన్స్ తో ఆడవాళ్లు అనుకున్న డేట్ ఆగేది లేదంటున్నారు. గతంలో ఇలాంటి కాంపిటేషన్ లోనే శతమానం భవతి ని రిలీజ్ చేసి హిట్ కొట్టిన ట్రాక్ రికార్డ్ శర్వానంద్ కి ఉంది. మళ్ళీ ఆడవాళ్లు మీకు జోహార్లు తో అదే ఫీట్ రిపీట్ చేస్తాడేమో చూద్దాం. మరి మాస్ vs క్లాస్ లో నెగ్గేది వెవరో? ఓడేది ఎవరో? ఫిబ్రవరి 25 న తేలిపోతుంది.