Advertisement
Google Ads BL

అమీర్ కోసం ప్రభాస్ త్యాగం


కరోనా ప్రభావం వలన కొంతమంది పట్టుదలకి పొతే మరి కొంతమంది వేరెవరి కోసమో త్యాగాలు చెయ్యాల్సి వస్తుంది. ఆర్.ఆర్.ఆర్ కోసం అలియా భట్ గంగూభాయ్ కతీయవాడి తో పాటుగా భీమ్లా నాయక్ మేకర్స్ త్యాగాలు చేసారు. కానీ అది వృధా అయిపోయింది. ఇక మళ్ళీ ఆచార్య కోసం ఎఫ్ 3 మేకర్స్ వెనక్కి తగ్గారు. అలా కరోనా వలన రిలీజ్ డేట్స్ మారుతూ, మారుస్తూ పోతున్నాయి. తాజాగా అమీర్ ఖాన్ కోసం ప్రభాస్ త్యాగం చేసాడు. ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో గత ఏడాది మొదలైన ఆదిపురుష్ మూవీ షూటింగ్ కంప్లీట్ కావడమే కాదు, షూటింగ్ మొదలు పెట్టినప్పుడే ఆగష్టు 11, 2022 న రిలీజ్ అన్నారు.

Advertisement
CJ Advs

అయితే ఏప్రిల్ 14 న రిలీజ్ కావాల్సిన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా కోసం ప్రభాస్, ఆదిపురుష్ మేకర్స్ టీ సిరీస్, భూషన్, ఓం రావత్ లు వెనక్కి తగ్గారు. ఆదిపురుష్ డేట్ ని అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా కోసం త్యాగం చేసారు. లాల్ సింగ్ చద్దా ఏప్రిల్ 14 నుండి కొన్ని కారణాలతో ఆగష్టు 11 కి పోస్ట్ పోన్ అయినట్లుగా అమీర్ ఖాన్ మరియు మేకర్స్ అధికారికంగా ప్రకటించడమే కాదు.. ఇందుకోసం టీ సిరీస్, భూషన్, ఓం రావత్ ఇలా అందరూ కూడా ఆదిపురుష్ సినిమాను వాయిదా వేసేందుకు ఎంతో గొప్ప మనసుతో అంగీకరించారంటూ థ్యాంక్స్ చెప్పారు. ప్రభాస్ ఆదిపురుష్ వాయిదా పడడంతో.. ప్రభాస్ ఫాన్స్ కాస్త ఫీలవుతున్నారు. ఒకే ఏడాది రెండు సినిమాలతో ప్రభాస్ సర్ ప్రైజ్ చేస్తాడనుకుంటే ఇలా చేసారేమిటి అంటూ వాళ్ళు బాగా హర్ట్ అవుతున్నారు. 

Shocker from Prabhas Adipurush:

<span>Laal Singh Chaddha locks new date</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs