Advertisement
Google Ads BL

త్వరగా వచ్చేయ్ బుచ్చీ.. తగ్గేదే లే..!!


ఉప్పెన సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన బుచ్చిబాబు డైరెక్టర్ గా తన కెరీర్ ని గ్రాండ్ గా స్టార్ట్ చెయ్యడంతో పాటు అటు వైష్ణవ తేజ్ కి ఇటు కృతి శెట్టి కి కూడా మంచి లాంచింగ్ ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఫిలిం మేకింగ్ లో కూడా తన గురువు సుకుమార్ కి తగ్గ శిష్యుడు అనిపించుకునేలాగా ఉప్పెన సినిమాని బాగా ప్రెజెంట్ చేసాడు. ఆ సినిమా అంత పెద్ద హిట్ అయినా ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా.. నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలోనూ చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ముందు స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా సిద్ధం చేసుకునే పని మీదే కాన్సంట్రేట్ చేసాడు.  

Advertisement
CJ Advs

బలమైన కథ కుదరడంతో దానిని అంతే పవర్ ఫుల్ గా స్క్రీన్ మీదకి తీసుకువచ్చే హీరో కావాలని ఎదురు చూస్తున్న బుచ్చిబాబు కి గురువు సుకుమార్ అండతో ఎన్టీఆర్ అనే అద్భుతమైన అప్షన్ దొరికింది. బుచ్చిబాబు చెప్పిన కథ విన్న ఎన్టీఆర్ చాలా ఎగ్జైట్ అయ్యారని, అయితే కథలో చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పడంతో బుచ్చిబాబు స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దే పనిలో పడ్డాడని టాక్. వీలైనంత త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన అధికారిక ప్రకటన రాబోతుందట. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో రానున్న ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

ఇప్పటికే ఈ సినిమా లో బాలీవుడ్ చిన్నది జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది అని, ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్ అని వార్తలు బయటికి వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ కి కావాల్సింది కేవలం అధికారిక ధ్రువీకరణ మాత్రమే. అది కూడా వీలైనంత త్వరలోనే వచ్చేస్తుంది అని ఆశిద్దాం. అలాగే నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న బుచ్చిబాబుకి పలు ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి శుభాకాంక్షలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో మనమూ తనని విష్ చేసేద్దాం. తారక్ సపోర్ట్ ఎలాగూ తధ్యం కనుక మరో బ్లాక్ బస్టర్ తో త్వరగా వచ్చేయ్ బుచ్చీ... తగ్గేదే లే..!!

Buchhi Babu Birthday Special :

Director Buchhi Babu Birthday Special 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs