Advertisement
Google Ads BL

బిగ్ న్యూస్ : నాగ్ నాన్ స్టాప్ ఫన్


సౌత్ లో బిగ్ బాస్ సీజన్స్ కి మధ్యన దాదాపుగా తొమ్మిది నెలల గ్యాప్ ఉంటుంది. సీజన్ వన్ దగ్గర నుండి అదే పద్దతి ఫాలో అవుతున్నారు స్టార్ మా యాజమాన్యం. కానీ బిగ్ బాస్ సీజన్ 5 ముగిసి ఇంకా రెండు నెలలు గడవక ముందే ఆరో సీజన్ కోసం ఏర్పాట్లని చకచకా ముగించేసింది. డిసెంబర్ 20 న సీజన్ 5 గ్రాండ్ ఫినాలే జరిగిన మళ్ళీ రెండు నెలలకి అంటే ఫిబ్రవరి 26 న సీజన్ సిక్స్ మొదలు కాబోతుంది. అది ఈసారి అరకొర ఓ గంటతో సరిపెట్టడం లేదు. ఏకంగా 24 గంటలూ బిగ్ బాస్ చూసేలా హాట్ స్టార్ తో కలిసి బిగ్ బాస్ ఓటిటి స్టార్ట్ చేస్తున్నారు. దానికి సంబందించిన ప్రోమో కూడా వచ్చేసింది. మళ్ళీ నాగార్జునే హోస్ట్ గా బిగ్ బాస్ ఓటిటి మొదలు కాబోతుంది. హోస్ట్ నాగార్జున తో బిగ్ బాస్ ప్రోమో రెడీ చేయించిన స్టార్ మా ఈసారి కొంతమంది స్టార్స్ ని కూడా దించేసింది. కేరెక్టర్ ఆర్టిస్ట్ మురళి శర్మ, కమెడియన్ వెన్నెల కిషోర్ తో బిగ్ బాస్ ప్రోమో రెడీ చేసారు.

Advertisement
CJ Advs

అందులో నాగార్జున లాయర్ గా, వెన్నెల కిషోర్ ఉరిశిక్ష పడిన ముద్దాయిగా కనిపిస్తున్నారు. ఉరి శిక్షపడిన ముద్దాయి చివరి కోరిక ఏమిటి అనగా.. నాకేం  కోరికలుంటాయని వెన్నెల కిషోర్ అనగా.. దానికి నాగార్జున బిగ్ బాస్ ఒకరోజు చూసి చచ్చిపోవాలనుంది అని అడుగు అనగానే.. బిగ్ బాస్ ఆ అని మురళి శర్మ అంటుంటే మరో పోలీస్ పోనిలే సర్ ఓ గంటేగా అని అనగా.. వెన్నెల కిషోర్ కి బిగ్ బాస్ చూసే అవకాశం ఇస్తారు. దానితో ఓ సోఫాలో వెన్నెల కిషోర్, నాగార్జున బిగ్ బాస్ చూస్తూ ఎమోషనల్ గా, ఫన్నీ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం 7.30 అలా అలా సాయంత్రం 7.30 అయినా బిగ్ బాస్ అవ్వదు. అలా పోలీస్ లు, అక్కడే ఉన్న లాయర్లు, జేడ్జ్ లు అందరూ బిగ్ బాస్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే హోస్ట్ నాగార్జున వచ్చి.. నో కామా, నో ఫుల్ స్టాప్, ఇప్పుడు బిగ్ బాస్ అవుతుంది నాన్ స్టాప్.. అంటూ ఫన్ చేసారు. 

24 గంటలూ హాట్ స్టార్ లో బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులకి అందుబాటులోకి రాబోతుంది. స్టార్ మా లో ఎప్పటిలాగే ఓ గంట ప్రసారమవుతుంది. నాగార్జున వీకెండ్ స్పెషల్ గా 2 డేస్ హౌస్ మేట్స్ తో ఫన్ అండ్ క్లాస్ షురూ చేస్తారన్నమాట. 

Big News: Nag Non Stop Fun:

Bigg Boss OTT Telugu- Starting February 26
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs