Advertisement
Google Ads BL

మొన్న హీరోలు.. నేడు కమెడియన్లు


సోషల్ మీడియా అనేది అందరికీ అందుబాటులో ఉండడంతో ట్రోలింగ్ అనేది విచ్చలవిడిగా సాగుతోంది. సందర్భం చూసుకుని సెటైర్లతో చెలరేగుతున్నారు నెటిజన్లు. ఈ రోజునా అదే జరిగింది. ప్రస్తుత మా అధ్యక్షుడు మంచు విష్ణు ఏపీ ముఖ్యమంత్రి వై,ఎస్.జగన్ రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అది వ్యక్తిగత సమావేశం అనీ, టికెట్ రేట్లతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలు చర్చించామని చెప్పిన విష్ణు త్వరలోనే తిరుపతిలో ఫిలిం స్టూడియో కడతాను అనీ, అందుకు ప్రభుత్వం మద్దతు కోరతానని తెలిపారు. అలాగే అంతకు ముందే జగన్ రెడ్డిని కలిసిన ప్రముఖ హాస్య నటుడు అలీ అతనికి రాజ్యసభ సభ్యత్వం లభించనుందనే ఊహాగానాలపై స్పందిస్తూ.ఆ విషయాన్నీ ప్రభుత్వమే అధికారికంగా ప్రకటిస్తుందని, తాను మాత్రం నిస్వార్ధంగా పార్టీ కోసం ప్రచారం చేశాననీ చెప్పుకొచ్చారు. అంతే.. సామాజిక మాధ్యమాల్లో సగటు జనాలు ఛలోక్తులతో చతురత చూపడం స్టార్ట్ చేసేసారు.

Advertisement
CJ Advs

మొన్న స్టార్స్ ను ఆహ్వానించిన జగన్ నేడు కమెడియన్లను కలిసారని అంటూ విష్ణు ని ఆలీని ఒకే గాటన కొందరు కట్టేస్తుంటే.. స్టూడియో కోసం ఒకరు - పదవి కోసం ఒకరు భలే జోడి వెళ్ళిందిలే. దొందూ దొందే అనేస్తున్నారు మరికొందరు. అంతేలెండి.. జరగాల్సినవి సవ్యంగా సక్రమంగా జరగనప్పుడు, సొంత పెత్తనాలు ఎక్కువైనప్పుడు చేసేవాడికంటే చూసేవాడు ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాడు. ఎవరి స్థాయి ఏంటనే ఇంగిత జ్ఞానం మరిచి మర్కట విన్యాసాలు చేస్తుంటాడు. 

Manchu Vishunu and Comedian Ali meets YS Jagan:

Satires on Manchu Vishnu and Comedian Ali on Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs