Advertisement
Google Ads BL

ఫ్యాన్సుని అస్సలు కేర్ చెయ్యని ప్రభాస్


బాహుబలితో పాన్ ఇండియా స్టారుగా ఎదిగిన ప్రభాస్ సాహో సినిమాకి కూడా టాక్ తో సంబంధం లేని రెవిన్యూ రప్పించి మార్కెట్ లో తనకెంత క్రేజ్ ఉందనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఇపుడు తాజాగా కేవలం ప్రభాస్ చరిష్మాతోనే రాధే శ్యామ్ కూడా రికార్డు స్థాయిలో థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుని మార్చి 11 న రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ K, స్పిరిట్ వంటి భారీ పాన్ ఇండియా  సినిమాల లైన్ అప్ ఉండడంతో ఖుషీ ఖుషీగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్సుని ఓ వార్త మాత్రం విపరీతంగా కలవర పెడుతోందట.

Advertisement
CJ Advs

ప్రస్తుతం మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో దేనికదే హ్యూజ్ స్పాన్ ఉన్న సినిమాలు చేస్తోన్న ప్రభాస్ మధ్యలో మారుతికి ఓ సినిమా చేసే అవకాశం ఉందన్న గాసిప్పు గుప్పుమనడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఎంటర్ టైనింగ్ హారర్ ఫిలింగా ఆ చిత్రం రూపొందనుందని, టైటిల్ రాజా డీలక్స్ అనీ, ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని, విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ స్కోప్ ఉండే కథాంశం కనుక మేజర్ షూటింగ్ పార్ట్ ఇండోర్ లోనే జరుగుతుందని, సింగిల్ షెడ్యూల్ లోనే కంప్లీట్ చేసేసే ప్లాన్ లో ఉన్నారని రోజుకో రూమర్ వినిపిస్తూ ఉంటే విసిగిపోతున్న ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నిరసన స్టార్ట్ చేసారు.

అన్నా.. మంచి ఫామ్ లో ఉన్న నువ్వు మారుతితో సినిమా చెయ్యడం  ఏంటి , ఇపుడు నీకున్న ఇమేజ్ ని మారుతి హ్యాండిల్ చేయలేడు, ప్లీజ్ అన్నా మాకు అటువంటి సినిమా వద్దే వద్దు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పోటెత్తుతున్నాయి. మరి అవి ప్రభాస్ దృష్టికి వెళ్ళాయో లేదో, వెళ్లినా ప్రభాస్ కేర్ చెయ్యట్లేదో కానీ నేడు అదే ప్రాజెక్టుపై మరో పుకారు పుట్టుకొచ్చింది. హోలీ రోజైన మార్చి 18 న ప్రభాస్ - మారుతిల సినిమా అఫీషియల్ ఎనౌన్సుమెంట్ ఉంటుందనేది దాని సారాంశం.. అసలివన్నీ ఎలా పుట్టుకు వస్తున్నాయో.. ఎవరు పుట్టిస్తున్నారో మీడియాకీ ఐడియా ఉంది కానీ ఆ కోతి చేష్టలను ఖండించాలంటే ప్రభాస్ స్వయంగా స్పందించే సమయం కోసం వేచి చూడక తప్పని పరిస్థితి.! 

Prabhas Does Not Care About The Fans At All:

Rumours Pouring On Prabhas Maruthi Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs