Advertisement
Google Ads BL

RC 15 షూట్ వెనుక ఇంట్రెస్టింగ్ థింగ్


పాన్ ఇండియా స్టార్ గా మారుతోన్న రామ్ చరణ్ - కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ ల క్రేజీ కాంబినేషన్ తో దిల్ రాజు SVC బేనరుకి 50 వ చిత్రంగా రానున్న RC 15 లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం రాజమండ్రి సమీపంలో జరుగుతోంది. ఆ సినిమా కథ నిమిత్తం 1930 కాలంలో జరిగే కొన్ని కీలక సన్నివేశాలను రామ్ చరణ్ పై తీస్తున్నారట శంకర్. కాగా ఈ షూట్ వెనుక దాగి ఉన్న మరో ఇంట్రెస్టింగ్ థింగ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. మెగా ఫ్యాన్సుకి మాంచి కిక్ ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అదేమిటంటే...

Advertisement
CJ Advs

ఈస్ట్ గోదావరి జిల్లా దోసకాయల పల్లిలో 1978 ఫిబ్రవరి 11 వ తేదీన పునాది రాళ్లు చిత్రం కోసం చిరంజీవి పై తొలి సన్నివేశం చిత్రీకరించారట. నాలుగు దశాబ్దాల తరువాత మళ్ళీ అదే ఊళ్ళో అదే నెలలో రామ్ చరణ్ షూటింగ్ జరుగుతూ ఉండడం విశేషంగా చెప్పుకుంటున్నారు అభిమానులు. ఈ విషయం చిరంజీవి దృష్టికీ వెళ్లిందని, ఆయన కూడా సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారనీ సమాచారం. 

Interesting Thing Behind The RC 15 Shoot:

RC 15 Latest Shcedule in East Godavari District
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs