Advertisement
Google Ads BL

దీప్తితో బ్రేకప్‌కు సిరి కారణం కాదు: షణ్ముఖ్


యూట్యూబ్ నెంబర్ వన్ స్టార్, కోటి మంది ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా హీరో షణ్ముఖ్ బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక పర్సనల్ గా చాలా లాస్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో సిరి ఫ్రెండ్ షిప్ అతనిపై నెగెటివిటీని తీసుకువచ్చింది . అతని ఫాన్స్ కూడా షణ్ముఖ్ ని హేట్ చేసారు. అలాగే షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన కూడా షణ్ముఖ్ తో ఉన్న ఐదేళ్ల బంధానికి బ్రేకప్ చెప్పింది. షణ్ముఖ్ - దీప్తి విడిపోవడానికి సిరినే కారణమంటూ ఆమెని విపరీతంగా ట్రోల్ చేసారు. అంతగా ఇబ్బంది పడిన షణ్ముఖ్ దీప్తి సునయనాకి ఆల్ ద బెస్ట్ చెప్పాడు కానీ ఎక్కడ దీప్తి బ్రేకప్ విషయం మాట్లాడలేదు. కానీ వాలెంటైన్స్ డే సందర్భంగా షణ్ముఖ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతని బ్రేకప్ విషయాలు మాట్లాడాడు. 

Advertisement
CJ Advs

తనలాంటి మూడి వ్యక్తికి బిగ్ బాస్ సెట్ కాదన్న షణ్ముఖ్.. సిరి తో చనువుగా ఉండడం నెటిజెన్స్ కి నచ్చలేదు కాబట్టి తనపై అంత నెగెటివిటి స్ప్రెడ్ అయ్యింది అని, కానీ దీప్తి తో తనకి బ్రేకప్ అవ్వడానికి సిరి మాత్రం కారణం కాదని అన్నాడు. ఎంతమంది తనని తప్పుబట్టినా దీప్తి సునయన తనని సపోర్ట్ చేసింది అని, కానీ నెటిజెన్స్ నెగెటివిటి, సిరి తో క్లోజ్ గా ఉండడం నెటిజెన్స్ కి నచ్చనట్టే దీప్తి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా నచ్చలేదు అని, ఆ విషయంలో దీప్తి సునయన అందరి నుండి ఒత్తిడి ఎదుర్కోవడంతో తనకి బాధ వేసింది అని, తాను హ్యాపీ గా ఉండాలనే ఉద్దేశ్యంతోనే బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది అని, ప్రెజెంట్ ప్రేమ వ్యవహారాలు పక్కనపెట్టి ఇద్దరం కెరీర్ పై ఫోకస్ పెట్టినట్లుగా చెప్పాడు షణ్ముఖ్.

అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో సిరి వాళ్ళ అమ్మ మీ హగ్గులు, ముద్దులు నచ్చలేదు అని అందరి ముందు చెప్పారని, అది నన్ను చాలా బాధ పెట్టింది అని, బిగ్ బాస్ హౌస్ మేట్స్ సిరిని ఏమైనా అంటే ఆమెకి తాను అండగా ఉన్నాను అని, సిరి మదర్ కి అదేం కనిపించలేదు అని, కానీ ఆవిడ తనని సిరిని తప్పుగా అర్ధం చేసుకున్నారని.. దీప్తి తో బ్రేకప్ అవడం వెనుక సిరి ఉందనేది నిజం కాదని, ఈ విషయంలో సిరిని ట్రోల్ చెయ్యడం కరెక్ట్ కాదంటున్నాడు షణ్ముఖ్.

Real Reason Behind Shanmukh and Deepthi Sunaina Breakup:

Shanmukh Jaswanth Reaction on Break Up with Deepthi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs