వాలెంటైన్స్ డే అంటే ప్రేమికులకు ప్రత్యేకమైన రోజు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు, ప్రేమించుకునే వారు. రిలేషన్ లో ఉన్న వారు ఇలా వాలెంటైన్స్ డే ని స్పెషల్ గా జరుపుకుంటారు. గత ఏడాది గ్లామర్ గర్ల్ రకుల్ ప్రీత్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ ని పరిచయం చేసింది. బాలీవుడ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ జాకీ తో ప్రేమలో ఉన్నాను అని చెప్పింది. తర్వాత పార్టీలు, ఫంక్షన్స్ అంటూ పబ్లిక్ గా నే గడిపింది. ఇక ఈ వాలెంటైన్స్ డే కి రకుల్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న సెల్ఫీని ట్విట్టర్ పోస్ట్ చేసి డిలేట్ చేసింది. మళ్ళీ అదే ఫోటో ని రకుల్ ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసి మై స్పెషల్ వాలెంటైన్ డే అంటూ పోస్ట్ చేసింది.
ఇక బాలీవుడ్ లో మరో లవ్ బర్డ్స్ ఈ రోజు ని స్పెషల్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. వారే ముదురు భామ మలైకా అరోరా - కుర్ర హీరో అర్జున్ కపూర్. వయసుతో సంబంధం లేకుండా మలైకా - అర్జున్ లు ప్రేమలో మునిగి తేలుతున్నారు. పెళ్లప్పుడు చేసుకుంటారు అని అడిగితే పెళ్ళికి అర్జెంట్ ఏముంది అంటారు. మలైకాకు నాకు మధ్య ఉన్న వయసు తేడా మీడియాలో ముఖ్యమైపోయింది. అదే కొంత డిస్ట్రబ్‌గా అనిపించింది. అలాంటి విషయాలపై వచ్చే నెగెటివ్ కామెంట్స్ ని పట్టించుకోము.. నాకోసం అన్ని వదులుకున్న మలైకా అంటే నాకు గౌరవం.. అంటూ అర్జున్ కపూర్ వాళ్ళ బంధంపై క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే ఈ జంట వాలెంటైన్స్ డే రోజుని స్పెషల్ గా చేసుకుంది. మలైకా డీప్ హగ్ అర్జున్ కపూర్ కి ఇవ్వగా.. అర్జున్ ఆమె నుదిటిపై ముద్దాడిన పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వాడు నావాడు అంటూ మలైకా క్యాప్షన్ పెట్టి మరీ షేర్ చేసింది. ఒకప్పుడు సీక్రెట్ గా మెయింటింగ్ చేసిన వీరి రిలేషన్ ని ఇప్పుడు పబ్లిక్ గానే మెయింటింగ్ చేస్తూ విమర్శకులకు ఘాటైన రిప్లై లు ఇస్తున్నారు.