Advertisement
Google Ads BL

విజిల్స్ వేయిస్తానంటున్న మహాలక్ష్మి


రామ్ పోతినేని - కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి కాంబోలో తెరకెక్కుతున్న ద వారియర్ మూవీ ఇటు తెలుగు, అటు తమిళ లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మధ్యనే రామ్ పోలీస్ డ్రెస్ లో ఉన్న వారియర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన టీం.. వాలంటైన్స్ డే సందర్భంగా హీరోయిన్ కృతి శెట్టి లుక్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అసలైతే ద వారియర్ నుండి కొన్ని వీడియో కట్స్ తో ఓ చిన్నపాటి టీజర్ రిలీజ్ చేద్దామనుకున్నారు టీం మెంబెర్స్. కానీ సమయం సర్దుబాటు కాకపోడంతో.. హీరోయిన్ ఇంట్రడ్యూస్ పోస్టర్ తో సరిపెట్టారు.

Advertisement
CJ Advs

ఉప్పెన సినిమాలో బేబమ్మగా, బంగార్రాజు మూవీలో సర్పంచ్ నాగ లక్ష్మి గా, శ్యామ్ సింగరాయ్ లో మోడరన్ గా కనిపించింది కృతి శెట్టి. తాను చేసిన ప్రతి పాత్రతోను హైలైట్ అయిన కృతి శెట్టి ద వారియర్ లో విజిల్ మహాలక్ష్మి గా కనిపించబోతుంది. పర్టిక్యులర్ గా తన పేరు ముందు విజిల్ చేర్చారు అంటే విజిల్ వేస్తూ బేబమ్మ ఈ సినిమాలో చేసే హడావిడి మనం ఊహించుకోవచ్చు. పందెం కోడి తర్వాత డైరెక్టర్ లింగుసామి.. హీరోయిన్ కేరెక్టరైజేషన్ ని మళ్లీ ఆ రేంజ్ లో వారియర్ లో డిజైన్ చేసినట్లుగా, ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ యాడ్ చేసే ప్రాసెస్ లో హీరోయిన్ కేరెక్టర్ ని అలా డిజైన్ చేశారట. విజిల్ మహాలక్ష్మి గా విజిల్స్ వేయించేలా కృతిశెట్టి మరోసారి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీ అవుతుంది.

Kriti Shetty role in The Warriorr out:

The Warrior love interest tempts all
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs