Advertisement
Google Ads BL

రేపు రొమాంటిక్ వార్ చూపిస్తారట


ఇస్మార్ట్ శంకర్ తర్వాత రెడ్ హాట్ ఫామ్ లోకి వచ్చేసిన రామ్ తన మార్కెట్ పెంచుకునే ప్లాన్స్ లో భాగంగా తమిళ్ స్టార్ డైరెక్టర్ లింగుసామితో బై లింగ్వల్ ఫిలిం ఓకె చేసాడు. ఫస్ట్ టైం ఖాకీ చొక్కా తొడిగాడు. ది వారియర్ గా రాబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో నేరుగా... ఇతర భాషలకు అనువాదంగా వెళ్లనున్న ఈ మూవీలో రామ్ చేస్తోన్న పెరఫార్మెన్స్ ఇంటెన్స్ అనే వర్డ్ కి ఇంకో మీనింగ్ చూపించే రేంజ్ లో ఉందని ఇన్ సైడ్ టాక్. 

Advertisement
CJ Advs

ఇప్పటికే రన్, పందెంకోడి వంటి సూపర్ హిట్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న లింగుసామికి ఇదే ఫస్ట్ స్ట్రయిట్ తెలుగు ఫిలిం. ఇటు రామ్ కి కూడా ఇదే తొలి తమిళ చిత్రం కానుంది. తన తెలుగు సినిమాలని హిందీలో డబ్ చేసి పెడితేనే వందల మిలియన్ల కొద్దీ వ్యూస్ ఇస్తోన్న నార్త్ ఆడియన్స్ ని కూడా ఈ సినిమా హిందీ వెర్షన్ తో మీట్ అవనున్నాడు రామ్. 

సరే అవన్నీ పక్కన పడితే... ది వారియర్ అంటూ ఇప్పటివరకూ యాక్షన్ ఫిలింగానే ఎస్టాబ్లిష్ అయిన ఈ సినిమాలోని రొమాంటిక్ లవ్ యాంగిల్ రేపు వాలైంటైన్స్ డే రోజున రివీల్ అవనుంది. ఆ విజువల్స్ కి మెయిన్ ఎట్రాక్షన్ కాబోతోంది ఉప్పెనలా దూసుకు వచ్చిన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి. 

ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్న ఈ లక్కీ గర్ల్ ఇపుడు వారియర్ రామ్ తో వహ్ వా అనిపించే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని చూపిస్తానంటోంది. మరింకేం ఇంకొన్ని గంటల్లోనే ఆ టేస్టీ ట్రీట్ ఆడియన్స్ ముందుకు రానుంది కనుక వేచి చూద్దాం.. ఆ ఇస్మార్ట్ హీరోతో ఈ ఇంప్రెసివ్ గర్ల్ ఏమేం చేసిందో - ఎందాకా వెళ్లిందో..! 

Telugu Film The Warrior Feb 14th Spl Glimps:

Hero Ram Pothineni Film The Warrior Valantines day Special Glimps
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs