Advertisement
Google Ads BL

మెస్మరైజ్ చేసేసింది మహేష్ మ్యాజిక్


లవర్స్ డే గిఫ్ట్ గా లవ్ లీ ట్రీట్ ఇవ్వాలని లావిష్ గా రెడీ చేసారు సర్కారు వారి కళావతి పాటని. కానీ సరైన కేర్ తీసుకోని మేకర్స్ వల్ల లీకర్స్ తమ పని తాము చేసేసారు. దాంతో 14 న ప్రైడ్ గా రావాల్సిన పాట 12 నే పైరసీగా వచ్చేసింది. జరిగిపోయినదాన్ని మార్చలేం కనుక జరిగే డ్యామేజ్ ని అయినా ఆపాలనే ఉద్దేశంతో అనుకున్న ప్లాన్ పక్కనెట్టి ఒక రోజు ముందుగానే కళావతిని సాగనంపేసారు సర్కారు వారి టీమ్. మరింతకీ వాలెంటైన్స్ డే స్పెషల్ గా వచ్చిన ఈ కళావతి సాంగ్ ఎలా ఉందంటే....

Advertisement
CJ Advs

మాంగల్యం తంతునా.. అంటూ వేద మంత్రాల టేక్ ఆఫ్ తో మొదలైన ఈ పాట ఆద్యంతం ఆ దారి తప్పకుండా కంప్లీట్ క్లాసికల్ టచ్ తోనే సాగింది. అందుకు అనుగుణంగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు సంగీత దర్శకుడు థమన్, గాయకుడు సిద్ శ్రీరామ్. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటలో చిక్కని పదాలతో చక్కని భావుకత వ్యక్తం చేసే ప్రయత్నం జరిగింది. అల్ మోస్ట్ గీత గోవిందంలోని ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే.. సాంగ్ ని రీ క్రియేట్ చేసేందుకు పరశురామ్ పడ్డ తపన కనిపిస్తోంది. లిరికాల్ వీడియో నే అంత గ్రాండ్ గా పిక్చరైజ్ చేయడం శెభాష్ అనిపిస్తోంది.

ఇక మనందరికీ కావాల్సిన మహేష్ విజువల్స్ విషయానికి వస్తే... లుక్స్ తోనే మెస్మరైజ్ చేసేసిన మహేష్ తన మార్క్ సింపుల్ డాన్స్ మూవ్ మెంట్ తో మ్యాజిక్ చేసేసాడు. మహానటి కీర్తి సురేష్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కూడా మహేష్ గ్లామర్ ముందు ఆనలేదంటే అతిశయోక్తి కాదు. ఓవైపు కీర్తి సురేష్ లో మునుపటి ఆకర్షణ తగ్గిందని ఫ్యాన్స్ కంగారు పడుతుంటే పెరిగిన తన ఎట్రాక్షన్ తో దాన్ని బ్యాలన్స్ చేస్తానంటూ మరింత అందంగా మారిపోయినట్టు అనిపించాడు మహేష్ బాబు. ఇక... ఇలా రిలీజ్ చేసారో లేదో అలా వైరల్ అయిపోతోన్న ఈ కళావతి సాంగ్ వ్యూస్ లోను, లైక్స్ లోను ఎన్నెన్ని రికార్డులు సృష్టిస్తుందో ముందు ముందు లెక్కెట్టుకుందాం..!!

Click Here: Kalaavati song from Sarkaru Vari Paata

Mahesh Mark Signature Step In Kalavathi Song:

Kalavathi Lyrical Song From Sarkaru Vari Paata Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs