రవితేజ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కించిన చిత్రం ఖిలాడి. నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యు, నైట్ కర్ఫ్యూ, అలాగే 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఎఫెక్ట్ కారణంగా మొదటి రోజు ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఊహించినంతగా రాలేదు. అయినా పర్లేదు.. ఓ మోస్తరు ఓపెనింగ్స్ అయితే ఖిలాడీకి దక్కాయి. కానీ క్రాక్ తర్వాత వచ్చిన రవితేజ సినిమాకి క్రాక్ తో పోలిస్తే ఈ ఓపెనింగ్ కలెక్షన్స్ చాలా తక్కువ అనే చెప్పాలి. క్రాక్ సినిమా మొదటి రోజు 7 కోట్ల వరకు వసూలు చేసింది. ఏది ఏమైనా చాలాచోట్ల ఖిలాడీ కి డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ అదిరిపోయే కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఖిలాడీ మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ మాదిరి ఈ వీకెండ్ కూడా కంటీన్యూ అయితే నిర్మాత కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఖిలాడీ ఓపెనింగ్ కలెక్షన్ మీకోసం..
ఏరియా కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం - 1.86
సీడెడ్ - 0.56
ఉత్తరాంధ్ర - 0.46
ఈస్ట్ గోదావరి - 0.26
వెస్ట్ గోదావరి - 0.21
గుంటూరు - 0.56
కృష్ణా - 0.18
నెల్లూరు - 0.21
ఏపీ, తెలంగాణ ఫస్డ్ డే కలెక్షన్స్ 4.30 కోట్లు (6.80 కోట్ల గ్రాస్)
ఇతర ప్రాంతాలు - 0.38 కోట్లు
ఓవర్సీస్ - 0.16 కోట్లు
ఖిలాడీ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్: 4.84 కోట్లు(8 కోట్ల గ్రాస్)