కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది హఠాన్మరణం పొందిన విషయం తెలిసిందే. కన్నడ ప్రజలు పునీత్ మరణాన్ని తట్టుకోలేకపోయారు. అలాగే టాలీవుడ్ ప్రముఖులు సైతం పునీత్ భౌతిక కాయాన్ని సందిర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. రీసెంట్ గా అల్లు అర్జున్ పునీత్ సమాధిని సందర్శించడమే కాకుండా ఆయన ఫ్యామిలీని కూడా కలిశారు. అయితే పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి పాన్ ఇండియా ఫిలిం జేమ్స్ రిలీజ్ కి రెడీ అవుతుంది. జేమ్స్ మూవీ ఐదు భాషల్లో మార్చి 17 న రిలీజ్ కాబోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉండగా.. పునీత్ కన్ను మూసారు. దానితో పునీత్ పాత్రకి ఆయన అన్న శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పి చిత్రాన్ని పూర్తి చేసారు.
ఓ వారం పాటు జేమ్స్ సినిమాకి పోటీగా ఏ భాష లోనూ సినిమాలు రిలీజ్ కావడం లేదు. అయితే జేమ్స్ సినిమా నుండి ఈ మధ్యనే టీజర్ రిలీజ్ అయ్యింది. ఆ టీజర్ పై పలువురు సినీ ప్రముఖులు ట్వీట్స్ కూడా చేసారు. తాజాగా జేమ్స్ మూవీ, పునీత్ రాజ్ కుమార్ ని తలచుకుంటూ హీరో ప్రభాస్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పునీత్ రాజ్ కుమార్ అభిమానులందరికీ ఈ చిత్రం ఎంతో ప్రత్యేకమైనది. జేమ్స్ రూపంలో అద్భుతమైన చిత్రాన్ని చూడబోతున్నాం. వుయ్ మిస్ యూ సర్.. అంటూ ప్రభాస్ ఎమోషనల్ గా ట్వీట్ చేసారు.