Advertisement
Google Ads BL

సీఎం ఆహ్వానం నాకు లేదు: మోహన్ బాబు


నిన్న ఏపీ సీఎం జగన్ ని కలిసేందుకు మెగాస్టార్ చిరు తో పాటుగా మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, నాగార్జున అంతా వెళుతున్నారని అన్నా చివరికి మహేష్, ప్రభాస్ మాత్రమే ఆయనతో అమరావతికి వెళ్లారు. ఇంకా ఈ మీటింగ్ కి ఎవరెవరు రాబోతున్నారని మీడియా వాళ్ళు చిరు ని అడగగా.. సీఎం జగన్ నుండి నాకు మాత్రమే ఆహ్వానం ఉంది. నాతో ఎవరెవరు వస్తున్నారో నాకు తెలియదని చిరు చెప్పాక.. చాలామంది లో చాలా అనుమాలు స్టార్ట్ అయ్యాయి. జగన్ పిలవలేదనే నాగార్జున వెళ్ళలేదేమో అన్నారు. ఇక మెగాస్టార్ బృందం జగన్ ని కలవడంపై కొంతమంది సుముఖంగా, కొంతమంది విముఖంగా ఉన్నారు. అలాగే మా అధ్యక్షుడు విష్ణు ని, జగన్ కి బంధువు అయిన మోహన్ బాబు ని జగన్ ఆహ్వానించలేదా అనే చర్చ కూడా మీడియాలో నడిచింది.

Advertisement
CJ Advs

అయితే మంచు మోహన్ బాబు కి నిజంగానే సీఎం నుండి ఆహ్వానం రాలేదట. ఆ విషయాన్ని మంత్రి పేర్ని నాని బయట పెట్టారు. ఈ రోజు మోహన్ బాబు ఫ్యామిలీ టీ కి పిలిస్తే వెళ్ళాను అని, అంతేకాని నిన్న జరిగిన మీటింగ్ విషయాలు సంజాయిషీ చెప్పడానికి వెళ్ళలేదు అని, మోహన్ బాబు తనకి ఎప్పటినుండో మిత్రుడు అని, అందుకే కలిసాను అని, ఇక తాను చెప్పిన తర్వాతే మంచు విష్ణు తన ట్వీట్ ను సోషల్ మీడియాలో అప్ డేట్ చేశారని చెప్పారు నాని. అయితే సీఎం ఆహ్వానం తనకి అందలేదని, ఒకవేళ ఆహ్వానిస్తే.. తప్పకుండా ఆ మీటింగ్ కి హాజరయ్యేవాడిని అని మోహన్ బాబు చెప్పినట్లుగా నాని చెప్పారు. 

I do not have the invitation of the CM Jagan: Mohan Babu:

Minister Perni Nani meets Mohan Babu at his residence
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs