బాలీవుడ్ బ్యూటీ, క్రేజీ హీరోయిన్ అలియా భట్ ఇప్పుడు బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ కి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. రామ్ చరణ్ తో ఆర్.ఆర్.ఆర్ లో జోడి కట్టిన అలియా భట్ ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా యంగ్ టైగర్ తో రొమాన్స్ కి రెడీ అయ్యింది. ఇక అలియా భట్ అటు హిందీ లోనూ వరస సినిమాలతో బిజీ. ప్రస్తుతం తాను నటించిన గంగూభాయ్ కతీయవాడి ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అయితే అలియా భట్ ఇంత బిజీ లోనూ తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో మంచిగా వెకేషన్స్, పార్టీలు అంటూ బాగా ఎంజాయ్ చేస్తుంది. గత మూడేళ్ళుగా కలిసి తిరుగుతున్న ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారు. రణబీర్ కపూర్ అయితే కరోనా లాక్ డౌన్ లేకపోతె పెళ్లి చేసేసుకునేవాళ్లమని కూడా చెప్పాడు.
ఇక అలియా భట్ సౌత్ సినిమాలు చేస్తున్నప్పుడు ఖాళీ సమయాల్లో అంటే ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ బ్రేక్ సమయంలో అలియా భట్ రణబీర్ కపూర్ ఫోన్ తో బిజీగా ఉండేది అంటూ అప్పట్లో ఎన్టీఆర్ రివీల్ చేసాడు. అలియా భట్ ని కరోనా లేకపోతె రణబీర్ తో మీ పెళ్లి జరిగిపోయేదట కదా అని గంగూభాయ్ కతీయవాడి ప్రమోషన్స్ లో మీడియా వారు అడగగా.. నా దృష్టిలో రణబీర్ కపూర్ తో నా పెళ్లి ఎప్పుడో అయ్యిపోయింది. రణబీర్ చెప్పింది నిజమే. లాక్ డౌన్ కారణంగా మా పెళ్లి వాయిదా పడింది. ప్రతి దానికి ఓ కారణముంటుంది. మంచి టైం చూసుకుని పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పింది.