ఇప్పుడు తెలుగు సినిమాలన్నీ హిందీ మర్కెట్ పై దడి చేస్తున్నాయి. కేవలం పాన్ ఇండియా మూవీస్ మాత్రమే కాకుండా.. తెలుగులో తెరకెక్కిన సినిమాలని హిందీలో కూడా రిలీజ్ చేసేస్తున్నారు. ఈమధ్యన తెలుగు మాస్ కమర్షియల్ మూవీస్ కి హిందీలో విపరీతమైన క్రేజ్ రావడంతో.. ఇక్కడి హీరోలంతా హిందీ లో సినిమా లు రిలీజ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రీసెంట్ గా రవి తేజ ఖిలాడీ మూవీ ని హిందీలో రిలీజ్ చేసారు మేకర్స్. అలాగే చిరంజీవి ఆచార్య కూడా హిందీ రిలీజ్ ఉంటుంది అని చెప్పారు. ఇంకా చాలా సినిమాలు హిందీ రిలీజ్ కి మొగ్గు చూపుతున్నాయి.
పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు భీమ్లా నాయక్ తో హిందీ కి వెళ్ళబోతున్నారట. మొన్నామధ్యన కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ హిందీ లో కూడా రిలీజ్ చెయ్యండి.. ఇప్పుడందరూ హిందీకి వెళుతుంటే.. పాన్ ఇండియా సబ్జెక్ట్ భీమ్లా నాయక్ ని ఎందుకు హిందీలో రిలీజ్ చెయ్యడం లేదంటూ ట్వీట్ల వర్షం కురిపించాడు. రీసెంట్ గా భీమ్లా నాయక్ నిర్మాత నాగ వంశి భీమ్లా నాయక్ హిందీ లో కూడా రిలీజ్ అవ్వబోతున్నట్లుగా కన్ ఫర్మ్ చెయ్యడంతో.. పవన్ కళ్యాణ్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.