Advertisement
Google Ads BL

జగన్ ఈగో శాటిస్ ఫై అయ్యిందా?


ఏపీ సీఎం జగన్ నిన్నటివరకు సినిమా ఇండస్ట్రీ విషయంలో తాను చెప్పిందే వేదం అన్నట్టుగా ఉన్నారు. టికెట్ రేట్స్ విషయంలో తగ్గేదే లే అన్నారు. దిల్ రాజు, దానయ్య  లాంటి బడా ప్ప్రొడ్యూసర్స్ కి అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. వారు కేవలం పేర్ని నాని తో మీట్ అయ్యారు అంతే. ఇక మధ్యలో నాగార్జున, చిరంజీవి విడివిడి గా జగన్ తో భేటీ అయ్యి లంచ్ చేసారు. అయినా జగన్ సినిమా ఇండస్ట్రీ విషయంలో వెనక్కి తగ్గలేదు. కానీ గురువారం టాలీవుడ్ ప్రముఖులకి తన మంత్రి తో ఫోన్స్ చేయించి మరీ తన దగ్గరకు స్టార్ హీరోలని వచ్చేలా చేసుకున్నారు జగన్.

Advertisement
CJ Advs

గతంలో ప్రొడ్యూసర్స్, చిరు, నాగార్జున మాత్రమే జగన్ మీటింగ్ కి హాజరయ్యేవారు. అప్పుడు ఏ ఒక్క స్టార్ హీరో కూడా జగన్ తో భేటీకి కదల్లేదు. జగన్ ఏపీలో థియేటర్స్ క్లోజ్ చేయించడం, అలాగే టికెట్ రేట్స్ తగ్గించేసి టాలీవుడ్ ని బెదిరించారు. అప్పటినుండి జగన్ అపాయింట్మెంట్ కోసం టాలీవుడ్ ప్రముఖులు పడిగాపులు పడేలా చేసారు. ఇక తాజాగా జగన్ టాలీవుడ్ ప్రముఖులకి ఆహ్వానాలు పంపించి మరీ తన దగ్గరకి రప్పించుకుని ఈగో శాటిస్ ఫై చేసుకున్నారని, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలని తన దగ్గరకి వచ్చేలా చేసుకుని.. ఇండస్ట్రీ సమస్యలని అర్ధం చేసుకుని  టికెట్ రేట్స్ పెంచి, ఐదో ఆటకి అనుమతులు ఇచ్చారని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

మరి మెగాస్టార్ ని మహేష్, ప్రభాస్, రాజమౌళిని జగన్ విడివిడిగా ఆహ్వానించారా? అనే ప్రశ్న చిరు నాకు మాత్రమే ఆహ్వానం అందింది అన్నదగ్గర రేజ్ అయ్యింది. ఈ ప్రముఖులతో పాటుగా నాగార్జున కానీ, బాలకృష్ణ కానీ, ఎన్టీఆర్ కానీ వెళ్ళలేదు. ఇక జగన్ టాలీవుడ్ ప్రముఖులతో భేటీ తర్వాత తాను సినిమా పరిశ్రమని ఆదుకుంటానికి ఇచ్చిన హామీలు మీడియా ముందు పెట్టారు. గతంలో ప్రముఖుల భేటీ తర్వాత ఒక్కమాట కూడా మాట్లాడని జగన్ ఈరోజు మీటింగ్ లో జరిగిన పలు విషయాలు వివరించారు. మరి నిజంగా జగన్ ఈగో శాటిస్ ఫై అవ్వబట్టే.. అలా చేసారని అంటున్నారు.

YS Jagan Meeting With Tollywood Stars:

Top Tollywood Actors, Filmmakers Meet AP CM YS Jagan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs