Advertisement
Google Ads BL

మహేష్ ఫ్యాన్స్ లో పోకిరి వైబ్స్


మహేష్ బాబు కి పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది. చాలా రఫ్ గా మాస్ పాత్రలో మహేష్ పెరఫార్మెన్స్ కి మహేష్ ఫాన్స్ పులకించిపోయారు. పూరి జగన్నాధ్ మహేష్ ని అంతలాంటి మాస్ గా ప్రెజెంట్ చేసి మాస్ ప్రేక్షకులని దగ్గర చేసాడు. ఆ సినిమాలో మహేష్ బాబు కి ఇలియానా కి మధ్యన రొమాన్స్ కూడా అదిరిపోయింది. సాంగ్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, మహేష్ లుక్, ఇలియానా అందాలు, పూరి మార్క్ మేకింగ్ అన్ని పోకిరి ని మహేష్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచేలా చేసాయి. అయితే మహేష్ ఇప్పుడు చేస్తున్న సర్కారు వారి పాట కూడా పోకిరి టైప్ లోనే ఉండబోతుంది అంటూ సూపర్ స్టార్ మహేష్ రెండుమూడుసార్లు హింట్ ఇచ్చారు. తన కేరెక్టర్ కి పోకిరి సినిమాకి కాస్త పోలిక ఉంటుంది అని చెప్పారు.

Advertisement
CJ Advs

అయితే సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ఇస్తూ ఓ పోస్టర్ వదిలారు. ఆ పోస్టర్ లో మహేష్ చాలా అంటే చాలా అందంగా రొమాంటిక్ గా కనిపించారు. మహానటి కీర్తి సురేష్ కి మహేష్ కి మధ్యన కెమిస్ట్రీ అద్భుతంగా సెట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ పోస్టర్ ని.. పోకిరిలో మహేష్ - ఇలియానా తో ఓ సాంగ్ లో రొమాన్స్ చేసే పోస్టర్ ని పక్క పక్కన పెట్టి మహేష్ ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. అప్పట్లో మహేష్ బాబు - ఇలియానా పోకిరి రొమాన్స్ పిక్, ఇప్పుడు మహేష్ - కీర్తి సురేష్ సర్కారు వారి పాట రొమాన్స్ పిక్స్ ని చూపిస్తూ Age is just a number for him ❤️ అంటూ మహేష్ బాబు ఏజ్ ఒక నెంబర్ మాత్రమే.. ఆయన లుక్స్ లో అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పు లేదు అంటూ పోకిరి సినిమాని గుర్తు చేస్తున్నారు. 

Pokiri Vibes in Mahesh Fans:

Mahesh Babu: Pokiri vibes in Sarkaru Vaari Paata
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs