రేపు 12 న థియేటర్స్ లో విడుదల కాబోతున్న సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. నిర్మాత నాగ వంశీ ఇంటర్వ్యూ లు, సిద్దు జొన్నల గడ్డ, నేహా శెట్టి ఇంటర్వూస్, డీజే టిల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ టీం బాగానే హడావిడి చేస్తుంది. మరోపక్క సిద్దు హీరోయిన్ తో కలిసి డీ డాన్స్ షో, అలాగే సుమ క్యాష్ షో కి గెస్ట్ లు వచ్చి సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని నిర్మించిన నాగ వంశి.. పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ ని కూడా తెరకెక్కించారు. ఇటు డీజే టిల్లు ప్రమోషన్స్ లో భాగంగా ఎప్పుడు ప్రెస్ పెట్టినా, లేదంటే ఇంటర్వ్యూ ఇచ్చినా.. అందరూ భీమ్లా నాయక్ రిలీజ్ గురించిన విషయాలే నాగ వంశీని అడుగుతున్నారు. సినిమా ఫిబ్రవరి 25 న విడుదల చేస్తున్నారా? లేదంటే ఏప్రిల్ 1 న విడుదల చేస్తున్నారా? అని.
అసలు డీజే టిల్లు ని ప్రమోట్ చేసుకుందామని ఆయన అనుకుంటే.. అందరూ భీమ్లా నాయక్ గురించి అడగడంతో ఆయన జగన్ పై నెట్టేస్తున్నారు. జగన్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూలు ఎత్తేస్తే, అలాగే 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఇస్తే.. భీమ్లా నాయక్ ని ఫిబ్రవరి 25 రిలీజ్ అని అంటున్నారు. ఎందుకంటే మా సినిమా పూర్తయ్యింది. మాకు టికెట్ రేట్స్ తో ఇష్యు లేదు.. కేవలం 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ కోసం వైటింగ్ అంటూ పదే పదే భీమ్లా నాయక్ రిలీజ్ పై వివరణ ఇవ్వాల్సి వస్తుంది.