Advertisement
Google Ads BL

మహేష్ బాబు లో చాలా మార్పొచ్చింది


మహేష్ బాబు చాలా రిజర్వేడ్ పర్సన్. ఆయన పెద్దగా ఎవరిలో కలవరు. ఇతర హీరోల్లా పార్టీలకి గట్రా వెళ్ళరు. మహేష్ బాబు ప్యూర్లీ ఫ్యామిలీ మ్యాన్. తనకి షూటింగ్ లో గ్యాప్ దొరికితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి ఇస్తారు. అలాగే కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉండే వ్యక్తి. స్టార్ హీరో స్టేటస్ మెయింటింగ్ చేస్తారో.. లేదంటే మహేష్ పద్ధతి అదేనో చాలామందికి అర్ధం కాదు. ఇక ఎప్పుడూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యడం, షూటింగ్స్ కంప్లీట్ చేసి పిల్లతో ఎంజాయ్ చేస్తుండే మహేష్ లో ఈమధ్యన మార్పు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే ఏజ్ లో వచ్చిన మార్పు, అందంలో వచ్చిన మార్పు కాదు. మహేష్ కి ఎంత వయసు వచ్చినా ఎప్పటికి హ్యాండ్ సమ్ గానే ఉంటారు.

Advertisement
CJ Advs

మహేష్ లో వచ్చిన మార్పు ఏమిటి అంటే.. ఎప్పుడూ మహేష్ బాబు ఎలాంటి టాక్ షోస్ కి కానీ, ఎలాంటి గేమ్ షోస్ లో కానీ పార్టిసిపేట్ చెయ్యలేదు. కానీ రీసెంట్ గా ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో లో పాల్గొనడడం, అలాగే బాలకృష్ణ తో ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో కి రావడం, మహేష్ లోని మరో కోణాన్ని ఈ షోలో ఫాన్స్ కి చూపించారు. అలాగే ఇండస్ట్రీ సమస్యలపై ఎప్పుడూ పెద్దగా పట్టించుకోనట్టు ఉండే మహేష్.. ఈ రోజు ఏపీ సీఎం జగన్ తో జరిగిన మీటింగ్ కి హాజరవడం, ఆ తర్వాత మీడియా తో మట్లాడడం అంతా కొత్తగా ఉంది. అందుకే చాలామంది మహేష్ లో వచ్చిన మార్పుని గుర్తిస్తున్నారు. మహేష్ చాలా మారాడు, ఆయనలో చాలా మార్పు వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Mahesh Babu has changed a lot:

Mahesh Babu: A complete family man and a noncontroversial hero
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs