సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్.. తరుచూ తన ఫొటోస్ ని షేర్ చేస్తూ అభిమానులకి కిక్ ఇస్తుంది. కొండ పొలం మూవీ తో రకుల్ కి టాలీవుడ్ కి ఆల్మోస్ట్ అనుబంధం తెగిపోయినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే రకుల్ ని సంప్రదించే దర్శకనిర్మాతలు లేరు, రకుల్ ఒప్పుకున్న తెలుగు సినిమాలు లేవు. సినిమాలు లేకపోయినా.. టాలీవుడ్ ఫ్రెండ్స్ తో పార్టిలకు హాజరయ్యే రకుల్ ని బాలీవుడ్ సాదరంగా ఆహ్వానించింది. బాలీవుడ్ లోను రకుల్ కి ఇంతవరకు సరైన హిట్ పడలేదు. వరసగా సినిమాలు చేస్తుంది కానీ.. రకుల్ ప్రీత్ కి సెటిల్ అయ్యే బ్లాక్ బస్టర్ పడలేదు. అయినా చేతినిండా సినిమాలతో కళకళలాడుతుంది.
అలాగే బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ ప్రేమలో మునిగితేలుతున్న రకుల్.. బాయ్ ఫ్రెండ్ తో పార్టీలు ఎంజాయ్ చేస్తుంది. తాజాగా రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో The earth 🌍 has music for those who listen 💕❤️ #mussoriediaries అంటూ ఓ బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసింది. అక్కడ కొండల మధ్యన కూర్చుని ముస్సోరి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. చలి వెయ్యకుండా జాకెట్ ధరించి ప్రకృతి అందాలని చూస్తూ రకుల్ మైమరిచిపోయిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.