గత కొన్ని వారాలుగా బాక్సాఫీసు దగ్గర ప్రేక్షకుల సందడి లేదు, సినిమా థియేటర్స్ లో విడుదల కావడం లేదు. ఆర్.ఆర్.ఆర్ వాయిదా తర్వాత, సంక్రాంతికి బంగార్రాజు, హీరో, రౌడీ బాయ్స్ లాంటి సినిమాలు సందడి చేసాయి. ఆతర్వాత రెండు వారాలుగా ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేసే సినిమాలేవీ రిలీజ్ అవ్వలేదు. కరోనా థర్డ్ వేవ్, ఏపీ టికెట్ రేట్స్ ఇష్యు.. అలాగే ఏపీ లో నైట్ కర్ఫ్యూలతో సినిమాలన్ని రిలీజ్ అవ్వకుండా సరైన తేదీల కోసం వెయిట్ చేసాయి. ఇక ఈ వారం పరిస్థితులు అనుకూలించడంతో బోలెడన్ని సినిమాలు అటు థియేటర్స్ లో ఇటు ఓటిటిలో సందడి చెయ్యబోతున్నాయి. ఇప్పటివరకు డల్ గా వున్న బాక్సాఫీసు కి ఊపు రాబోతుంది.
రేపు శుక్రవారం నాలుగు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంటే.. నాలుగు సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. అందులో రవి తేజ - రమేష్ వర్మ కాంబోలో క్రేజీ మూవీ గా తెరకెక్కిన ఖిలాడీ మూవీ, సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు మూవీ, హర్ష కనుమిల్లి సెహరి మూవీతో పాటుగా విష్ణు విశాల్ ఎఫ్ ఐ ఆర్ మూవీ లు థియేటర్స్ దగ్గర సందడి చెయ్యబోతున్నాయి. అలాగే విక్రమ్ - ధృవ్ మహాన్ అమెజాన్ ప్రైమ్ నుండి రిలీజ్ కాబోతుంటే, సుమంత్ నటించిన మళ్ళీ మొదలైంది జీ 5 ఓటిటిలో రిలీజ్ అవుతుంది.. ఇంకా ప్రియమణి భామ కలాపం ఆహా ఓటిటి నుండి, Gehraiyaan బాలీవుడ్ ఫిలిం కూడా అమెజాన్ ప్రైమ్ నుండి ఈ శుక్రవారం అందుబాటులోకి రానున్నాయి. సో ఈ వారం ప్రేక్షకులకి ఈ కొత్త సినిమాలతో పండగ చేసుకోబోతున్నారు.