Advertisement
Google Ads BL

పిక్ టాక్: మహేష్ ని సర్ ప్రైజ్ చేసిన చిరు


టాలీవుడ్ సెలబ్రిటీస్ స్పెషల్ ఫ్లైట్ లో ఏపీ సీఎం జగన్ ని కలిసేందుకు అమరావతికి వెళ్లారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి మెగాస్టార్ చిరు ఆయనతో పాటుగా స్టార్ హీరోలైన ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి లు జగన్ ని కలిసేందుకు వెళ్లిన వారిలో ఉన్నారు. అందరూ ఉదయం 10 గంటలకు బేగం పేట ఎయిర్ పోర్ట్ నుండి బయలు దేరారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి వీరంతా జగన్ ని కలిసేందుకు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం సుదీర్ఘంగా లంచ్ టైం వరకు సాగవచ్చని అంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్ అంతా కలిసి ఒకే ఫ్లైట్ వెళ్లిన పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసారు చిరు. ఆ పిక్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చిరు పుష్ప గుచ్చం ఇచ్చి ఆయనకి 17 వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. మహేష్ కి ఫ్లవర్ బొకే బహుకరించిన పిక్ ని చిరు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. Wishing @urstrulyMahesh & #NamrataShirodkar one of the most loveable and loved couples a very happy 17th Wedding Anniversary!! Wishing you both a lifetime of love, laughter and togetherness!.. అంటూ మహేష్ బాబు కి భార్య నమ్రతకి 17 వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. 

Megastar wishes to Mahesh babu:

Chiranjeevi wishes to Mahesh babu on his Wedding anniversary
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs