Advertisement
Google Ads BL

జగన్ ఆహ్వానం నాకు మాత్రమే: మెగాస్టార్


ఈ రోజు ఏపీ సీఎం తో జరగబోయే కీలక సమావేశం కోసం టాలీవుడ్ ప్రముఖులైన మెగాస్టార్ చిరు, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల, నిర్మాత నిరంజన్ రెడ్డి లు బేగం పేట ఎయిర్ పోర్ట్ నుండి స్పెషల్ ఫ్లైట్ లో అమరావతికి తరలి వెళ్లారు. అయితే చిరు వెంట స్టార్ హీరోలైన మహేష్, ప్రభాస్ వెళ్లడం చర్చనీయాంశమైంది., ఇలాంటి మీటింగ్స్ కి ఎప్పుడూ దూరంగా ఉండే వీరు చిరు తో పాటు జగన్ ని కలుస్తున్నారు. మొదటి నుండి చిరంజీవి కి సపోర్ట్ గా ఉండే నాగార్జున ఈ మీటింగ్ కి హాజరవడం లేదు. నాగార్జున చిరు తో పాటుగా జగన్ ని కలిసేందుకు వెళ్లకపోవడంపై రకరకాల కారణాలు మీడియాలో వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నుండి ఆహ్వానం అందకపోవడం వలనే నాగార్జున ఈ మీటింగ్ కి వెళ్లలేదని, వేరే కారణాలతో నాగార్జున ఈ మీటింగ్ కి దూరంగా ఉన్నారంటూ ఏవేవో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

Advertisement
CJ Advs

ఇక మెగాస్టార్ ని ఫ్లైట్ ఎక్కేముందు జగన్ తో భేటీ ఎలా ఉండబోతుంది, మీతో పాటు ఎవరెవరు ఈ సమావేశానికి వస్తున్నారని మీడియా మిత్రులు అడగగా.. దానికి చిరంజీవి సంచలనంగా మట్లాడారు. ఏపీ సీఎం జగన్ నుండి నాకు మాత్రం ఆహ్వానం అందింది అని, నాతో పాటు ఎవరెవరు వస్తారో అది వాళ్ళ ఇష్టం, అసలు ఎవరు వస్తున్నారో నాకు తెలియదు అని చెప్పడంతో.. నిజంగానే నాగార్జునని ఏపీ ప్రభుత్వం ఆహ్వానించకపోబట్టే.. ఆయన వెళ్ళలేదేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఏది ఏమైనా ఈ సమావేశం మాత్రం ఆసక్తికరంగా మారింది.

Megastar sensational comments on Jagan meeting:

Megastar Chiranjeevi comments on Tollywood industry 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs