ఈ రోజు ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల సమావేశంపై సర్వత్రా ఆసక్తి చోటు చేసుకుంది. అయితే అక్కడ సమావేశంలో టికెట్ రేట్ ఇష్యు అలాగే, థియేటర్స్ సమస్యలపై ముఖ్యంగా మాట్లాడతారనే విషయం తెలిసిందే,. కానీ జగన్ తో మీటింగ్ కి ఎవరెవరు వెళతారని విషయమై అందరిలో విపరీతమైన ఆసక్తి ఉంది. ఎందుకంటే ఈసారి జగన్ తో సమావేశానికి టాలీవుడ్ ప్రముఖులు మాత్రమే కాకుండా స్టార్ హీరోలు వెళ్ళబోతున్నారనే న్యూస్ తో ఫాన్స్ లో ఆత్రుత ఎక్కువైంది. నిహజంగానే మహేష్ బాబు వెళతారా? ప్రభాస్, ఎన్టీఆర్, కూడా చిరు తో పాటుగా ఏపీకి వెళతారా? అనే సందేహాలు మొదలైపోయాయి.
అయితే ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, చిరు బృందంతో అమరావతికి వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ కి రావడం తో అందరిలో ఉన్న అనుమానాలు ఒక్కొకటి ఎగిరిపోయాయి. మెగాస్టార్ చిరు, మహేష్ బాబు, రాజమౌళి, నాగార్జున ఇంకొంతమంది ప్రముఖులు స్పెషల్ ఫ్లైట్ లో అమరావతికి వెళ్ళబోతున్నారు.
ఈ రోజు గురువారం ఉదయం టాలీవుడ్ ప్రముఖులు సీఎం జగన్ తో భేటీ అవుతున్నారు. ఇక మెగాస్టార్ ని ఫ్లైట్ ఎక్కేముందు మీడియా వారు చిరు ని మాట్లాడమని కోరగా.. అమరావతిలో జగన్ తో సమావేశం తర్వాత అన్ని విషయాలను మీడియా కి వివరిస్తాను.. అప్పటివరకు వెయిట్ చెయ్యమని కోరారు.