సినిమా లవర్స్ అంతా రేపు గురువారం ఏపీ సీఎం తో జరగబోయే టాలీవుడ్ పెద్దలు సమావేశం ఎలా ఉండబోతుంది, ఆ సమావేశంలో ఏం జరగబోతుంది అనే ఆసక్తితో ఉన్నారు. మెగాస్టార్ చిరు అధ్యక్షతన టాలీవుడ్ నుండి కొంతమంది ప్రముఖులు స్పెషల్ ఫ్లైట్ లో అమరావతికి వెళ్లి జగన్ ని కలవబోతున్నారు. వారి అప్పాయింట్మెంట్ కూడా ఖరారయ్యింది. రేపు ఉదయం 11 గంటలకు సినీ పెద్దలతో జగన్ భేటీ కాబోతున్నారు. అయితే కొంతమంది ఇప్పటికే టికెట్ రేట్స్ విషయమై జీవో వచ్చేసింది, ఆ జీవో ప్రకారం టికెట్ రేట్స్ పెరిగాయి అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ అదంతా ఏం లేదని.. ఇంకా టికెట్ రేట్స్ పై కమిట్ రిపోర్ట్ రాలేదని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు.
టికెట్ రేట్స్ ఇష్యుపై కమిటీ రిపోర్ట్ వచ్చాకే మాట్లాడతామని, ఇక రేపు జగన్ ని కలబోయే వారు పరిమిత సంఖ్యలోనే హాజరు కావాలని వాళ్ళకి చెప్పినట్లుగా మంత్రి నాని చెప్పారు. కరోనా ప్రోటోకాల్ వలన పరిమిత సంఖ్యలోనే సినీ ప్రముఖులు సీఎం జగన్ ని కలవడానికి వస్తున్నారని నాని అన్నారు. మరి మెగాస్టార్ చిరు వెంట స్టార్ హీరోలు వెళుతున్నారని ఈ రోజు ఉదయం నుండి ఒకటే ఊదరగొడుతున్నారు. చిరు వెంట ఎవరెవరు స్పషల్ ఫ్లైట్ ఏక్కుతారో అనేది రేపు ఉదయం తెలుస్తుంది.