గ్లామర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు పర్సనల్ లైఫ్ ని, ప్రెగ్నెన్సీ లైఫ్ ని ఎంతో ఆస్వాదిస్తోంది. కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగానే తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లు తో ఏడడుగులు వేసిన కాజల్.. తన కమిట్మెంట్స్ ని చకచకా పూర్తి చేసేసింది. తర్వాత వివాహబంధాన్ని పరిపూర్ణం చేసుకునే ప్లాన్ చేసుకుంది. కాజల్ ప్రెగ్నెంట్ అవడంతో.. కొన్ని కమిట్మెంట్స్ వదులుకున్న కాజల్.. ప్రెగ్నెన్సీని ఆస్వాదిస్తోంది. ప్రెగ్నెన్సీ తొలినాళ్లలో ఈ విషయమై సైలెంట్ గా ఉన్న కాజల్ అగర్వాల్.. రీసెంట్ గా బేబీ బంప్ తో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. అయితే సోషల్ మీడియాలో హీరోయిన్స్ మీద జరిగే బాడీ షేమింగ్ కామెంట్స్ కి పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పింది.
నా లైఫ్ తో పాటుగా, నా బాడీలో చోటు చేసుకున్న మార్పులని నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా, ఇలాంటి సమయంలో బాడీ షేమింగ్ కామెంట్స్ చెయ్యడం కరెక్ట్ కాదు, ఇలాంటి విషయాలు కష్టంగా అనిపించినా ఎలా మసులుకోవాలో, ఎలా ఉండాలో నేర్చుకోండి. మీ బ్రతుకు మీరు బ్రతుకుతూ వేరే వారిని బ్రతకనివ్వండి. నాలాగా నెగెటివిటీని ఎదుర్కొనేవారితో నా ఆలోచనలు పంచుకుంటున్నాను, ప్రెగ్నెన్సీ టైం లో మహిళల్లో అనేక మార్పులు వస్తాయి. అది బరువు పెరగడం, బిడ్డ పెరిగే కొలది పొట్ట పెరగడం, అలా పొట్ట పెరగడంతో స్ట్రెచ్ మార్క్స్ కూడా పడటం జరుగుతుంది. మూడ్ తొందరగా మరిపోతుంది. త్వరగా అలిసిపోతుండడం, ఇక నెగెటివ్ ఆలోచనల వలన అనారోగ్యం పాలవుతాం. బిడ్డ పుట్టాక మళ్ళీ మాములు స్థితికి రావడానికి టైం పడుతుంది.
కొంతమందిలో మాములు స్థితి కూడా రాకపోవచ్చు ఇవన్నీ ఆలోచిస్తూ పిల్లలకి జన్మనివ్వడం అనేదాన్ని ఒత్తిడిగా ఫీలవ్వకండి. బిడ్డ పుట్టడం అనేది ఓ పండగలాంటిది.. దాన్ని ఆస్వాదించండి అంటూ కాజల్ తాను పంచుకుంటున్న అనుభూతులని పంచుకుంటూనే.. బాడీ షేమింగ్ చేసే వాళ్ళకి గడ్డి పెట్టింది.