బోల్డ్ కంటెంట్ పేరుతొ యూట్యూబ్ లో బూతుల పురాణం తో విపరీతంగా పాపులర్ అయిన బిగ్ బాస్ సరయు.. రీసెంట్ గా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఏ కంటెంట్ తో అయితే పాపులర్ అయ్యిందో.. ఆ కంటెంట్ వలనే ఆమె అరెస్ట్ అయ్యింది. ఓ రెస్టారెంట్ ప్రమోషన్స్ కోసం చేసిన సాంగ్ వలన సరయు ఈ కేసులో ఇరుక్కుంది. సరయూ, ఆమె టీం తలకు గణపతి బప్పా మోరియా అని రాసి ఉన్న బ్యాండ్స్ ధరించి మద్యం మత్తులో ఆ సాంగ్ లో కనిపించడంతో.. హిందూ మనోభావాలను దెబ్బతినేలా ఈ సాంగ్ ఉంది అంటూ విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు అశోక్ సరయు పై కంప్లైంట్ చెయ్యగా.. బంజారా హిల్స్ పోలీస్ లు సరయుని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు.
అయితే సరయు సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ లో తాను కేవలం నటిస్తాను అని, అందులో తనకి ఇష్టమైన వీడియో పోస్ట్ చేసే హక్కు గాని దానిని ఎడిట్ చేసి హక్కు గాని తనకు లేవు అని, అదంతా సెవెన్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి చెబితే తాను అలా చేశాను అని సరయు చెప్పుకొచ్చింది. తాను కూడా ఒక హిందూ అయినప్పుడు మరో హిందూ మనస్తత్వాన్ని ఎందుకు కించపరిచే విధంగా చేస్తాను అని చెప్పిన సరయు.. ఈ విషయం మీద ఎవరి మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని ఆమె కోరింది. ఇంత చెప్పిన సరయు.. తాను అరెస్ట్ అవ్వలేదని, పోలీస్ లు ఈ కేసు లో వివరణ కోరితే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చినట్టుగా చెప్పడం విశేషం.