Advertisement
Google Ads BL

బాలకృష్ణ - చిరు ఎపిసోడ్ అందుకే చెయ్యలేదు


బాలకృష్ణ తో ఆహా అన్ స్టాపబుల్ ప్రోగ్రాం ఎంతగా క్లిక్ అయ్యిందో.. ఫస్ట్ ఎపిసోడ్ నుండి చివరి ఎపిసోడ్ వరకు చూసేసాం. మోహన్ బాబు ఎపిసోడ్ నుండే ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో పై రేకెత్తించిన ఇంట్రెస్ట్ ని ఆఖరి మహేష్ ఎపిసోడ్ వరకు కంటిన్యూ చేయగలిగారు. అయితే ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో ఇంతగా సక్సెస్ అయినా.. ఎక్కడో ఏదో తెలియని వెలితి. అది మెగా హీరోలెవరూ బాలకృష్ణ గారి టాక్ షోకి రాకపోవడమే. మెగాస్టార్ చిరు వస్తారని అటు మెగా ఫాన్స్, ఇటు సాధారణ ఆడియన్స్ చాలా ఎక్సపెక్ట్ చేసారు. కానీ ఫస్ట్ సీజన్ పూర్తయ్యిపోయింది. మెగాస్టార్ జాడ లేదు. అల్లు అరవింద్ గారు, అదీ మెగా కాంపౌండ్ టాక్ షో కి చిరు హాజరవకపోవడం విచిత్రంగానే ఉంది. అయితే చిరు ఈ అన్ స్టాపబుల్ ప్రోగ్రాం కి ఎందుకు రాలేదో.. ఆ షోకి స్క్రిప్ట్ రైటర్ గా పని చేసిన మచ్చ రవి రివీల్ చేసాడు.

Advertisement
CJ Advs

మచ్చ రవి ఆహా టాక్ షో ఫస్ట్ సీజన్ షూటింగ్ పూర్తవ్వగానే.. యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని  అన్ స్టాపబుల్ టాక్ షో ముచ్చట్లు చెబుతున్నాడు. ఆ క్రమంలోనే మెగాస్టార్ చిరు ఈ షోకి ఎందుకు రాలేదో చెప్పాడు. బాలయ్య తో అన్ స్టాపబుల్ టాక్ షో అక్టోబర్ 28 న మొదలు పెట్టామని, ఆ తర్వాత నవంబర్ 2 కి బాలయ్యకి భుజానికి ఆపరేషన్ జరిగింది అని, ఈ లోపులో చిరు మూడు ప్రాజెక్ట్స్ షూటింగ్స్ తో బిజీ అయ్యి.. ఈ టాక్ షోలో పాల్గొనేందుకు ఆయన డేట్స్ సంపాదించలేకపోయామని, అలా సీజన్ వన్ పూర్తయ్యింది అని, అదే చిరు బాలయ్య టాక్ షోకి వచ్చి ఉంటే.. ఆ క్రేజ్, ఆ అంచనాలు వేరే లెవెల్ లో ఉండేవి అని, ఇక అన్ స్టాపబుల్ సీజన్ 2 కి అయినా మెగాస్టార్ వస్తారేమో.. రారో ఇప్పుడే చెప్పలేము అంటూ చిరు, బాలయ్య టాక్ షోకి రాకపోవడానికి గల కారణాలు వివరించాడు. 

Bvs Ravi About Chiranjeevi Unstoppable Season 2:

Machha Ravi about Aha Balakrishna Unstoppable Show 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs