కరెప్షన్ ని క్వశ్చన్ చేసే కథాంశం చేపట్టినప్పుడు చెలరేగిపొతారు శంకర్. జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ వంటి సంచలన విజయాలే అందుకు సాక్ష్యం. చాల రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు శంకర్ ఆ ట్రాక్ లోకి వచ్చారు. రామ్ చరణ్ 15 వ చిత్రంగా, దిల్ రాజు బేనర్ లో 50 వ చిత్రంగా రూపొందే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం పొలిటికల్ టచ్ ఉన్న కథని ఎంచుకున్నారట. ఆ కథలో కాంటెంపరరీ ఇష్యూస్ చాలానే ఉన్నాయని తెలుస్తోంది.
తన కెరీర్ ప్రారంభం నుంచీ ఎంతో సపోర్టింగ్ గా ఉన్న రచయిత సుజాత కన్ను మూయడంతో గత కొన్ని సినిమాల మేకింగ్ లో శంకర్ కాస్త తడబడ్డారని చెప్పాలి. అయితే ఇప్పుడాయనకి పిజ్జా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రూపంలో తోడు దొరికింది. కార్తీక్ సుబ్బరాజ్ చెప్పిన స్టోరీ ఐడియాని తన మార్క్ ట్రీట్ మెంట్ తో స్క్రిప్ట్ గా మలిచారట శంకర్. రాజకీయ నేపథ్యంతో పలు సామజిక అంశాలను స్పృశిస్తూ సాగే ఈ స్క్రిప్ట్ ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారనీ, ఈసారి శంకర్ తన సత్తా ఏంటో చాటుకుంటారని ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెబుతున్నారు యూనిట్ మెంబర్స్.
కాగా ఈ RC 15 లేటెస్ట్ షెడ్యూల్ రాజమండ్రి సమీపంలో ప్లాన్ చేసారు. దాదాపు 20 రోజులపాటు అక్కడే షూటింగ్ జరగనుంది. ప్రస్తుతం ముంబై ట్రిప్ లో ఉన్న రామ్ చరణ్ నెక్సెట్ వీక్ ఈ షూట్ కి అటెండ్ అవుతారట. చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోన్న ఈ క్రేజీ ఫిలింలో జగపతిబాబు, జయరాం, సునీల్, అంజలి తదితర భారీ తారాగణమే ఉంది. అంతేకాదు... ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం మరో పెద్ద స్టార్ గెస్ట్ రోల్ చేసే అవకాశమూ ఉంది.!