Advertisement
Google Ads BL

బాలయ్యా.. మామ్మూలోడివి కాదయ్యా.!


స్టేజీ ఎక్కి మైక్ పట్టుకోగానే మా నాన్నగారూ అంటూ ఊదరగొడతారని, పొలిటికల్ మీటింగ్సులో బుల్ బుల్ అంటూ తడబడిపోతారని బాలకృష్ణని ట్రోల్ చేసేవాళ్ల నోళ్లు మూతపడేలా చేసింది ఆహా అన్ స్టాపబుల్ షో. 

Advertisement
CJ Advs

నిజంగానే ఈ షోలో బాలయ్య చేసిన అల్లరి, స్పాంటేనియస్ గా కట్ చేసిన జోక్స్, వెంట వెంటనే వెలువడ్డ కౌంటర్స్ ఆడియన్సుని విపరీతంగా ఆకట్టుకున్నాయి. నందమూరి అభిమానులనైతే ఆనందడోలికల్లో ముంచెత్తాయి. అందుకే ఎంటైర్ ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టాక్ షోగా నిలిచింది అన్ స్టాపబుల్. ఐఎండిబి వంటి సైట్ లో 9.7 /10  రేటింగ్ నమోదు కావడం ఈ షో వీక్షకులకు ఎంతటి వినోదాన్ని పంచింది అనేదానికి నిదర్శనం కాగా.. ఆహా యాప్ లో అయితే మోస్ట్ వ్యూవ్డ్ షో గా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ  ఏకంగా 40 కోట్ల నిముషాలకు పైగా స్ట్రీమింగ్ టైమ్ తో  ఆల్ టైమ్ రికార్ట్ సృష్టించేసింది.

జనరల్ గా ఏ ఫ్లాట్ ఫామ్ లో అయినా టాక్ షో అంటే గెస్ట్ గా ఎవరొస్తారు, ఎం మాట్లాడతారు అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే అన్ స్టాపబుల్ షోని మాత్రం గెస్ట్ కోసం కాదు హోస్ట్ కోసమే చూసారనే నిజాన్ని నిక్కచ్చిగా చెప్పొచ్చు. ఆ రేంజ్ లో రెచ్చిపోయారు బాలయ్య. మనకి నచ్చిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూసినట్టు.. మనసుకి నచ్చిన పాటను పదే పదే విన్నట్టు ఈ టాక్ షో కి తెగ రిపీట్స్ వేసేస్తున్నారు వ్యూవర్స్. మరి సెకండ్ సీజన్ స్టార్ట్ అయ్యేవరకు ఇదే జోరు కొనసాగితే వ్యూవర్ షిప్ వైజ్ అన్ స్టాపబుల్ షో మరిన్ని అన్ బ్రేకబుల్ రికార్డ్స్ ని మన ముందు ఉంచుతుంది అనడంలో సందేహం లేదు. 

ఏక కాలంలో అటు అఖండ విజయంతో వెండితెరపై తన పవర్ చూపించి.. ఇటు ఆహా అనిపించే అన్ స్టాపబుల్ ఫన్ తో బుల్లితెర పైనా తన ప్రత్యేకతని ప్రదర్శించిన నందమూరి నటసింహంపై బాలయ్యా.. నువ్వు మామ్మూలోడివి కాదయ్యా అంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

Unstoppable With NBK Talk Show Creating Sensational Records:

Nbk Unstoppable Talk show All Time Record in Aha App
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs