Advertisement
Google Ads BL

సోషల్ మీడియాకి ఊపొచ్చింది


నిన్నటివరకు సోషల్ మీడియా బోసిపోయింది. అఖండ, పుష్ప, ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్, రాధేశ్యామ్ ప్రమోషన్స్, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రమోషన్స్, బాలీవుడ్ మూవీ అప్ డేట్స్ తో ఫాన్స్ కి ఉత్సాహాన్ని ఇచ్చిన సోషల్ మీడియా గత నెల రోజులుగా చప్పగా కనబడుతుంది. కారణం బడా సినిమాలు, పాన్ ఇండియా మూవీస్ వాయిదా పడడమే. జనవరిలో గనక ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, వాలిమై సినిమాలు రిలీజ్ అయ్యుంటే.. వాటి ప్రమోషన్స్ తో సోషమ్ మీడియా షేక్ అయ్యేలా ఆయా హీరోల ఫాన్స్ ఆ సినిమాలను ట్రెండ్ చేసేవారు. కానీ వాయిదా పడడం, ప్రమోషన్స్ ఆగిపోవడంతో ఫాన్స్ కూడా డిస్పాయింట్ అయ్యారు. 

Advertisement
CJ Advs

అయితే మళ్ళీ సినిమాల కొత్త రిలీజ్ డేట్స్ తో సోషల్ మీడియా ఊపిరి పోసుకుంటుంది.

ఈ నెల 11 న నాలుగు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవడం, అలాగే వాలంటైన్స్ డే అప్ డేట్స్, అలాగే ప్రతి వారం బాక్సాఫీసు దగ్గర ప్రేక్షకుల సందడి, ఇంకా బిగ్ బడ్జెట్, పాన్ ఇండియా మూవీస్ అప్ డేట్స్, ప్రమోషన్స్ అబ్బో సోషల్ మీడియాకి మళ్ళీ కళ వచ్చేసినట్టే. ఈ నెలలో విడుదల కాబోయే గంగూబాయి కతీయవాడి, వాలిమై, ఇంకా ఫిబ్రవరి 25 నే రిలీజ్ అంటున్న భీమ్లా నాయక్, అలాగే మార్చి 11 న విడుదల కాబోతున్న రాధే శ్యామ్ ప్రమోషన్స్ తో సోషల్ మీడియాలో ఫాన్స్ చేసే రచ్చ తో బాక్సాఫీసు దగ్గర ఎంత పండగ వాతావరణం ఉంటుందో.. సోషల్ మీడియాలోనూ అదే పండగ వాతావరణం కనబడుతుంది. 

Social media shines with updates:

Movie updates haling social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs