మరో మూడు రోజుల్లో మాస్ మహారాజ రవితేజ ఖిలాడీగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న విషయం తెలిసిందే. పక్కా రవితేజ మార్క్ కమర్షియల్ ఫిలింగా ఖిలాడీని మలిచారట దర్శకుడు రమేష్ వర్మ. క్రాక్ వంటి స్టుపెండస్ హిట్ తర్వాత వస్తోన్న రవితేజ సినిమా ఇదే కావడం - రాక్షసుడు వంటి సూపర్ హిట్ అనంతరం రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన మూవీ ఇదే అవడం వల్ల ఖిలాడీకి బజ్ భారీగా క్రియేట్ అయింది. అన్నిచోట్లా ఓ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయనే అంచనాలున్న ఈ ఖిలాడీ నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం ప్రముఖ పంపిణీదారులైన దిల్ రాజు, ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నేటి వరకూ పోటీ పడ్డారట. అయితే ఫైనల్ గా ఫాన్సీ ఆఫర్ తో ఖిలాడి నైజాం హక్కులను దిల్ రాజే దక్కించుకుని... ఫిబ్రవరి 11 న ఖిలాడీ క్రాకింగ్ రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇక్కడ పర్టిక్యులర్ గా క్రాకింగ్ రిలీజ్ అనే వర్డ్ ఎందుకు వాడాల్సి వచ్చిందంటే... లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన రవితేజ క్రాక్ సినిమాకి దిల్ రాజు సరైన థియేటర్లు దక్కనివ్వలేదంటూ బహిరంగంగానే విమర్శించారు డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను. ఆ వివాదాస్పద సంఘటన తర్వాత విడుదల అవుతోన్న రవితేజ చిత్రం ఇదే కనుక.. దీనికి దిల్ రాజే డిస్ట్రిబ్యూటర్ కనుక ఖిలాడీని గ్రాండ్ గా రిలీజ్ చేయడంలో దిల్ రాజు తన మార్క్ చూపిస్తారని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
కాగా ఇప్పటికే విడుదలైన పాటలతోను, నిన్ననే వచ్చిన ట్రైలర్ తోను ఫుల్ ప్లెడ్జెడ్ మాస్ మసాలా మూవీ అనే కలర్ ఇస్తోన్న ఖిలాడీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రేపు ( ఫిబ్రవరి 9 ) సాయంత్రం నిర్వహించనున్నారు. పార్క్ హయత్ లో గ్రాండ్ గా జరుగనున్న ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఎవరనే విషయం నెక్సెట్ అప్ డేట్ లో తెలుసుకుందాం.!