Advertisement
Google Ads BL

రాకింగ్ డైరెక్టర్ తో రజనీ తాజా చిత్రం


అభిమానుల కోరిక మేరకు ఏడు పదులు దాటిన వయసులోనూ వరుసగా సినిమాలు చేస్తూ వస్తోన్న సూపర్ స్టార్ రజనీకాంత్ కి సాలిడ్ సక్సెస్ మాత్రం దక్కట్లేదు. రోబో రేంజ్ హిట్ మళ్ళీ ఇవ్వడం 2 .0  తీసిన శంకర్ వల్లే కాలేదు. ఇక ఇతర దర్శకులైతే కబాలి, కాలా, పేట, దర్బార్, పెద్దన్న వంటి అట్టర్ ప్లాపుల్ని రజనీకి అంటగట్టారు. హీరోగా రజనీకి ఉన్న అన్ మ్యాచబుల్ క్రేజ్ వల్ల తన ప్రతి సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడం.. ఆపై చటుక్కున చతికిల పడడం జరుగుతూ వస్తోంది. దాని ఫలితంగా సినిమా సినిమాకి రజని మార్కెట్ తగ్గుతూ పోతోంది. అది గమనించే ఎలర్ట్ అయ్యారట సూపర్ స్టార్. ఇకమీదట సెలెక్టివ్ గానే సినిమాలు చెయ్యాలని ఫిక్స్ అయిన రజనీ గత కొన్ని రోజులుగా కేవలం కథలు వినే పనిమీదే ఉన్నారు. ఫైనల్ గా ఓ ప్రాజెక్టుకి అంగీకారం తెలిపారు. అదేంటంటే...

Advertisement
CJ Advs

ఆ మధ్య శివ కార్తికేయన్ తో డాక్టర్ అనే మూవీ చేసి సూపర్ హిట్ కొట్టి, ఇపుడు విజయ్ తో బీస్ట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తోన్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్పి సూపర్ స్టార్ ని బాగా ఇంప్రెస్ చేశారట. వెంటనే ఆ స్టోరీ ఓకే చేసిన రజని సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చెయ్యబోయే సదరు ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలిసింది. అయితే వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసెయ్యాలనే నిబంధన విధించారట రజనీ. ఆయన ఆదేశాల మేరకు మే నెలలో ఆ మూవీని మొదలుపెట్టి దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చెయ్యాలనే ప్లానింగ్ జరుగుతోంది. తలైవర్ 169 గా తెరకెక్కే ఈ క్రేజీ ఫిలింకి చెందిన మరిన్ని వివరాలు మరో అప్ డేట్ లో..!

Superstar Rajnikanth Teams Up With Nelson Dilipkumar :

Rajnikanth - Nelson dilipkumar Combo For Thalaivar 169
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs