Advertisement
Google Ads BL

లైగర్ డిజిటల్ రైట్స్ కి కళ్ళు చెదిరే డీల్


విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన లైగర్ మూవీ షూటింగ్ రీసెంట్ గానే పూర్తయ్యింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కటౌట్ కి, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం మిక్స్ అయితే అవుట్ ఫుట్ ఇలానే ఉంటుంది అనే రేంజ్ తో లైగర్ మూవీ గ్లిమ్ప్స్ ఉన్నాయి. బాక్సర్ గా బాక్సింగ్ రింగ్ తో మైక్ టైసన్ తో విజయ్ దేవరకొండ పోరాట సన్నివేశాలు, అనన్య పాండే తో విజయ్ దేవరకొండ రొమాన్స్ అన్ని లైగర్ మూవీకి హైలెట్ అంటున్నారు. ఇక పూరి మీద నమ్మకం, విజయ్ మీద ఎక్సపెక్ట్షన్స్ తో లైగర్ మూవీ తో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ భాగస్వామిగా మారారు.

Advertisement
CJ Advs

ఇక తాజాగా లైగర్ మీదున్న అంచనాలతో లైగర్ సినిమా డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ భారీ డీల్ కి కొనుగోలు చేసింది అంటున్నారు. అది అమెజాన్ ప్రైమ్ వారు లైగర్ మూవీ డిజిటల్ హక్కుల కోసం 60 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించింది అని సోషల్ మీడియాలో విపరీతంగా ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. విజయ్ దేవరకొండ కి అలాగే పూరీ జగన్నాధ్ సినిమాలకు ఇంత పెద్ద మొత్తంలో డిజిటల్ ధర పలకడం ఒక రికార్డు. దీనితో లైగర్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ లోకి దిగడమే కాదు, వరల్డ్ వైడ్ గా ఆగస్టు 25 న రిలీజ్ కాబోతుంది. 

Record price for Liger Digital Rights:

Vijay Deverakonda Liger digital rights bagged by Amazon Prime Video
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs