Advertisement
Google Ads BL

టాలీవుడ్ కీలక సమావేశం వాయిదా


రేపు మంగళవారం టాలీవుడ్ లో కీలక సమావేశం జరగనుంది. టాలీవుడ్ నిర్మాతలు, మెగాస్టార్ చిరు ఇంకా టాలీవుడ్ ప్రముఖులు ఈ కీలక సమావేశంలో పాల్గొనబోతున్నారు. మెగాస్టార్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతున్న ఇప్పుడు చిరు కూడా ఇండస్ట్రీ లోని అందరిని కలుపుకుపోవాలని చూస్తున్నారు. అందుకే చిరు స్వయంగా ఇండస్ట్రీ పెద్దలకి ఫోన్ చేసి మరీ ఈ మీటింగ్ కి ఆహ్వానించినట్లుగా ఫిలింసర్కిల్స్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే రేపు జరగబోయే ఈ కీలక సమావేశంలో ఏం జరగబోతుంది, అందరూ కలిసి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఆత్రుత అందరిలో ఉంది.

Advertisement
CJ Advs

ఇంకా ఈ సమావేశంలో ఏపీ సీఎం ని జగన్ ని కలిసే విషయం చర్చిస్తారని, ఆంధ్రాలో టికెట్ రేట్స్, అలాగే బెన్ఫిట్ షోస్ నిర్వహణ, ఇంకా 5 వ ఆటకి అనుమతులపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

అయితే రేపు జరగాల్సిన కీలక సమావేశం మరోసారి వాయిదా పడింది. రేపు జరగబోయే ఈ సమావేశానికి కొంతమంది సినీ పెద్దలు అందుబాటులో లేని కారణంగా ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. కొందరు షూటింగ్స్ తో ఇతర ప్రాంతాల్లో ఉండడంతో ఈ మీటింగ్ వాయిదా వేశారని అంటున్నారు. అందరూ అందుబాటులోకి రాగానే ఈ సమావేశం నిర్వహించేలా మరో తేదీని సూచిస్తారని తెలుస్తుంది.

Tollywood meeting postponed once again:

Tollywood producers meeting postponed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs