Advertisement
Google Ads BL

జనగణమన ని కన్ ఫర్మ్ చేసారుగా


పూరి జగన్నాధ్ డ్రీం ప్రాజెక్ట్ జనగణమన ఎంతోమంది స్టార్స్ దగ్గరికి వెళ్లి రిజెక్ట్ అయ్యి ఫైనల్ గా విజయ్  దేవరకొండ దగ్గర ఆగింది. విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబోలో జనగణమన ప్రాజెక్ట్ ఉండబోతుంది అని ఈమధ్యన సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్. లైగర్ సినిమా రిలీజ్ అవ్వకుండా పూరి తన డ్రీం ప్రాజెక్ట్ జనగణమని మొదలు పెట్టెయ్యబోతున్నాడు.. అది కూడా ఈ నెల చివరి వారంలోనే అమెరికా వేదికగా ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నారని ఫిలిం నగర్ లో గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

Advertisement
CJ Advs

కానీ ఈ ప్రాజెక్ట్ విషయంలో పూరి జగన్నాద్, విజయ్ దేవరకొండ నుండీ ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా పూరి జగన్నాధ్ జనగణమని కన్ ఫర్మ్ చేసేసారు. ఈ రోజు ఆదివారం పూరి - విజయ్ దేవరకొండ కాంబో లైగర్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది అని చెబుతూ.. పూరి జగన్నాధ్ వాయిస్ తో ఓ వీడియో ని జై జనగణమన అంటూ పూర్తి చెయ్యడంతో.. పూరి జగన్నాధ్ తన డ్రీం ప్రాజెక్ట్ జనగణమన ని ఈ విధంగా అనౌన్స్ చేసాడు అంటున్నారు నెటిజెన్స్.

Puri Jagannadh Jana Gana Mana has been confirmed:

<span>Vijay Devarakonda Liger shoot wrapped</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs