Advertisement
Google Ads BL

పవన్ - హరీష్ ల మూవీకి ముహూర్తం ఫిక్స్


గబ్బర్ సింగ్ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో రానున్న భారీ చిత్రం భవదీయుడు భగత్ సింగ్. 2021 లోనే అఫీషియల్ గా కన్ ఫర్మ్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్టుని 2022 ఏప్రిల్ 2 వ తేదీ ఉగాది రోజున లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఆల్ రెడీ భీమ్లా నాయక్ ని రిలీజ్ కి రెడీగా పెట్టి, త్వరలో మొదలు కానున్న హరి హర వీరమల్లు తాజా షెడ్యూల్ కోసం సిద్ధం అవుతోన్న పవన్ కళ్యాణ్ ఏప్రిల్ లో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కి డేట్స్ ఇచ్చారట. 

Advertisement
CJ Advs

కాగా ఈ మూవీలో పవన్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డేని ఎంపిక చేసారని సమాచారం. పవన్ కళ్యాణ్ కి పలు మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తమ గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో మరో అద్దిరిపోయే ఆల్బమ్ కి శ్రీకారం చుట్టారట ఇప్పటికే.! రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేయనున్న భవదీయుడు భగత్ సింగ్ మూవీకి పవన్ ఆప్త మిత్రుడు ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా, అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి సంబందించిన మరిన్ని వివరాలు, విశేషాలు నెక్సెట్ అప్ డేట్ లో..!!

Bhavadeeyudu Bhagatsingh launching date fixed :

Bhavadeeyudu Bhagat Singh Shoot Starts From April 2nd
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs