Advertisement
Google Ads BL

ఖిలాడీ ట్రైలర్ డేట్ ఫిక్స్


రవితేజ - రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కిన ఖిలాడీ మూవీ ఈ నెల 11 రిలీజ్ అవ్వబోతుంది. నిన్నటివరకు ఖిలాడీ మూవీ ఫిబ్రవరి 11 నుండి 18 కి డేట్ మార్చుకుంది.. ఆంధ్ర లో జగన్ ఇంకా నైట్ కర్ఫ్యూలు పొడిగించారు. అది ఫిబ్రవరి 14 తో ముగుస్తుంది అందుకే ఫిబ్రవరి 18 కి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నప్పటికీ.. ఫైనల్ గా మేకర్స్ ఖిలాడీ మూవీ రిలీజ్ ని ఫిబ్రవరి 11 కే ఫిక్స్ చేసి.. ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. తెలుగు తో పాటుగా హిందీ లోను భారీగా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఖిలాడీ ట్రైలర్ డేట్ కూడా లాక్ చేసారు. అది ఈ నెల 7 సాయంత్రం 5.04 నిమిషాలకు ఖిలాడీ ట్రైలర్ రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా డేట్ తో పాటుగా టైం కూడా లాక్ చేసింది టీం. రవితేజ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్న ఈ సినిమాలో డింపుల్ హయ్యాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. యాంకర్ అనసూయ పవర్ ఫుల్ కేరెక్టర్ చంద్ర కళగా కనిపించబోతుంది. రీసెంట్ గానే ఖిలాడీలోని కీలక పాత్రలను పోస్టర్స్ తో సహా పరిచయం చేసారు.

Brace for Khiladi trailer treat:

Ravi Teja Khiladi Trailer date fix
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs