అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఆ పైన ఉన్న పోస్టర్ నిజమై ఉండేది. మహేష్ - వంశీ పైడిపల్లిల కలయిక మహర్షి కంటే ముందే మనముందుకు వచ్చేది. ఆ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే...
ప్రభాస్ హీరోగా చేసిన మున్నాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయిన వంశీ పైడిపల్లి ఆ వెంటనే మహేష్ ని కలిశారట. కృష్ణా ముకుంద మురారి అనే టైటిల్ తో ఓ కథ చెప్పారట. స్టోరీ కాన్సెప్ట్ మహేష్ కి నచ్చినప్పటికీ అప్పుడు తనకి ఉన్న వేరే కమిట్ మెంట్స్ వల్ల ఆ మూవీ చేయలేకపోయారు మహేష్. ఈ అంశం బాలయ్య చేస్తోన్న ఆహా అన్ స్టాపబుల్ షోలో రివీల్ అయింది. ఆ క్షణమే అదే కథ బృందావనం అనే సంగతిని ఫ్యాన్స్ సర్కిల్ పసిగట్టేసింది.
మహేష్ కి నచ్చిన ఆ కథ, ఎన్ఠీఆర్ మెచ్చిన అదే కథ దిల్ రాజు బ్యానర్ లో బృందావనం సినిమాగా రూపుదిద్దుకుని తారక్ ని ఫామిలీ ఆడియన్స్ కి బాగా చేరువ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. క్రేజీ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, సమంతలతో పాటు ప్రకాష్ రాజ్, శ్రీహరి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం వంటి భారీ తారాగణంతో తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో మహేష్ నటించి ఉంటే ఎలా ఉండేదో ఊహించుకుంటే ఓ గమ్మత్తైన ఫీలింగ్ కలగొచ్చు కానీ... తారక్ కూడా తగ్గిందేమీ లేదు. కాస్త క్లాస్ గా కనిపించినా లోపల ఒరిజినల్ అలాగే ఉంది అంటూ రచ్చ రచ్చ చేసాడు బృందావనంలో..!!