Advertisement
Google Ads BL

చిరంజీవి ఆ రేర్ ఫీట్ రిపీట్ చెయ్యగలరా?


తెలుగు తెర ఎప్పటికీ మరిచిపోలేని జంట ఎన్టీఆర్ - సావిత్రి. 

Advertisement
CJ Advs

మిస్సమ్మ , గుండమ్మ కథ వంటి పలు కల్ట్ క్లాసిక్ మూవీస్ లో జంటగా నటించి ఎవర్ గ్రీన్ కపుల్, ఎక్సట్రార్డినరీ యాక్టర్స్ అనిపించుకున్న ఎన్టీఆర్ - సావిత్రి రక్త సంబంధం సినిమాలో అన్నా చెల్లెళ్లుగా కూడా సాటిలేని నటన కనబరిచి ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిల్లేలా చేశారు. అటు జంటగా కనిపించి మెప్పించడంలో, ఇటు అన్నా చెల్లెళ్లుగా నటించి ఒప్పించడంలో ఎన్టీఆర్ - సావిత్రి కనబరిచిన ప్రతిభకు కనీసం కంపేరిజన్ కూడా ఇప్పటివరకు రాలేదనే చెప్పాలి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఓ అగ్ర కథానాయకుడు ఆ తరహా ప్రయత్నం చెయ్యబోతున్నారు. అదే మెగాస్టార్ చిరంజీవి.

సై రా నరసింహారెడ్డి సినిమాలో తనకి జంటగా నటించిన నయనతార ని తన అప్ కమింగ్ మూవీ గాడ్ ఫాదర్ లో సిస్టర్ కేరెక్టర్ కి  తీసుకున్నారు చిరు. గాడ్ ఫాదర్ కథని బట్టి చిరు అన్నగా, నయనతార చెల్లిగా కనిపించే ఈ  సినిమాలో వాళ్ళిద్దరి మధ్య పెద్దగా అనుబంధం ఉండదు. పైగా ఓ అగాధం ఉంటుంది. ఓ అపార్థం ఉంటుంది. ఫైనల్ గా ఆ సిస్టర్ క్యారెక్టర్ అన్నని అర్ధం చేసుకునే సిట్యుయేషన్ వస్తుంది. ఆ అన్న తన చెల్లెలికి అండగా నిలబడి చేసే యుద్ధం ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. 

మరీ అద్భుతమైన కథతో, అర్ధవంతమైన పాత్రలతో చిరు - నయన్ లు అప్పట్లో ఎన్ఠీఆర్ - సావిత్రి క్రియేట్ చేసిన రేర్  ఫీట్ ని రిపీట్ చేయగలరా.. ఆ స్థాయిలో అన్నా చెల్లెళ్ళ కెమిస్ట్రీని ఆన్ స్క్రీన్ పండించగలరా అనేది అందరూ వేచి చూస్తోన్న అంశం. ప్రస్తుతం నయనతారపై గాడ్ ఫాదర్ కి చెందిన కీలక సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. నెక్స్ట్ వీక్ చిరంజీవి జాయిన్ అయి నయనతారతో తన కాంబినేషన్ సీన్స్ చేయబోతున్నారు.

Will Chiru repeat that feat:

Nayanthara to join Chiranjeevi and Mohan Raja Godfather
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs