Advertisement
Google Ads BL

నెటిజెన్ నోటి దూల - సింగర్ సునీత ఫైర్


సింగర్ సునీత గత ఏడాది మ్యాంగో రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రామ్ - సునీత ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సునీత కి ఇది రెండో పెళ్లి. అయితే వారిద్దరి జంట అంతాగా బాగోదని నెటిజెన్స్ చేసే కామెంట్స్ పై సింగర్ సునీత ఫైర్ అవుతూనే ఉంటుంది. రీసెంట్ గా సింగర్ సునీత తన భర్త రామ్ తో కలిసి హైదరాబాద్ నగర శివార్లలోని ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలోని సమతా విగ్రహం దగ్గర ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్ లో సునీత అందంగానూ, రామ్ కాస్త ఏజెడ్ పర్సన్ లా కనిపించారు.

Advertisement
CJ Advs

దానితో నెటిజెన్స్ కాస్త నెగెటివ్ గానే కామెంట్స్ చేసారు. ఓ నెటిజెన్ ఇంకాస్త ముందుకు వెళ్లి కాకి ముక్కుకు దొండ పండు. సునీతకు ముసలి రామ్ మొగుడు! అందం ఈమె సొంతం ధనము ఆయన సొంతం! గానం ఈవిడది దర్జా అతనిది అంటూ ఏవేవో బ్యాడ్ కామెంట్స్ చేసాడు. దానితో మండిన సునీత ఆ నెటిజెన్ కి ఘాటుగా రిప్లై ఇచ్చింది. నోటి దూల నీది. నీ భారం భూమిది అంటూ కౌంటర్ వెయ్యడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలోనూ సునీత ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ చాలా ఎదుర్కొంది. అయినా ఎప్పుడూ వాటికీ పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పే సునీత.. ఇప్పుడు ఇలా ఆ నెటిజెన్ పై ఫైర్ అవడం మాత్రం నెట్టింట్లో సంచలంగా మారింది.  

Singer Sunitha Fires on Netizen:

Singer Sunitha Fires on Netizen
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs