Advertisement
Google Ads BL

50 డేస్ పార్టీ చేసుకుంటున్న పుష్ప


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ గత ఏడాది డిసెంబర్ 17 న హడావిడిగా రిలీజ్ అయ్యింది. అల్లు అర్జున్ తొందర పడ్డాడు, కాబట్టే గట్టిగా ప్రమోషన్స్ చెయ్యకుండానే పుష్ప ని పాన్ ఇండియాలో వదిలాడు అన్నారు కానీ.. ఆఖరికి అల్లు అర్జున్ డెసిషన్ కరెక్ట్ అనేలా పుష్ప కలెక్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా అప్పుడు గనక పుష్ప రిలీజ్ అవ్వకపోతే మళ్ళీ ఈ ఏడాదికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చేది. కరోనా థర్డ్ వేవ్ లో థియేటర్స్ లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ వలన చాలా సినిమాలు వాయిదాలు పడాల్సి వచ్చింది. హడావిడి ప్రమోషన్స్ అయితేనేమి.. అల్లు అర్జున్  పుష్ప సినిమా ని రిలీజ్ చేసి 50 రోజులు పూర్తి చేసాడు. పుష్ప 50 డేస్ పూర్తవడంతో యూనిట్ పండగ చేసుకుంటున్నారు.

Advertisement
CJ Advs

అది కూడా ఐదు భాషల్లో 365 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి వరల్డ్ వైడ్ గా సత్తా చాటాడు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ లుక్, మేనరిజమ్స్, రష్మిక, సుకుమార్ డైరెక్షన్ అన్ని పుష్ప సినిమాకి ప్లస్ అవడంతో.. ఐదు భాషల్లోనూ పుష్ప హిట్ అయ్యింది. హిందీ లో అయితే పుష్ప కి ఊహించని కలెక్షన్స్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కొద్దిపాటి ప్రమోషన్స్ తోనే పుష్ప హిందీ బాక్సాఫీసుని షేక్ చేసింది. అదే గనక మరింతగా సినిమాని ప్రమోట్ చేసినట్లయితే.. పుష్ప కి కళ్ళు చెదిరే కలెక్షన్స్ వచ్చి ఉండేవి. ఏది ఏమైనా పుష్ప పార్ట్ వన్ హిట్ తో యూనిట్ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. సినిమా చివరిలో ఫహద్ ఫాసిల్.. పార్టీ లేదా పుష్ప అన్నట్టుగా..  పుష్ప 50 డేస్ పూర్తి చేసుకోవడంతో.. పుష్ప యూనిట్ ఈ మూమెంట్ ని సెలెబ్రేట్ చేసుకుంటూ పోస్టర్ రిలీజ్ చేసింది.

Pushpa completes 50 days:

50 Days for the AAll India MASSive Blockbuster Pushpa The Rise
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs