కరోనా సెకండ్ వేవ్ కి ముందు విడుదల కావాల్సిన రానా - సాయి పల్లవిలా విరాట పర్వం సినిమాకు ఇంతవరకు రిలీజ్ డేట్ ఇవ్వలేదు. సెకండ్ వేవ్ పోయింది. థర్డ్ వేవ్ వచ్చింది, అది పోయింది. మధ్యలో బోలెడన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. కొన్ని ఓటిటి బాట పట్టాయి. కానీ విరాట పర్వానికి మాత్రం రిలీజ్ డేట్ దొరకడం లేదు. జనవరిలో విడుదల వాయిదాలు పడిన సినిమాలన్నీ ఒక్కొక్కటి రిలీజ్ డేట్స్ ఇచ్చేసాయి. ఈ రోజు ఫిబ్రవరి 4 నుండి చిన్న, పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. విశాల్ సామాన్యుడు సినిమా నేడు రిలీజ్ అయ్యింది.
అలాగే ఖిలాడీ, సన్ అఫ్ ఇండియా, భీమ్లా నాయక్, ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్, ఆచార్య, F3, సర్కారు వారి పాట.. ఆఖరికి నిన్నగాక మొన్న షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నాని అంటే సుందరానికి మూవీ కూడా రిలీజ్ డేట్స్ హంగామాలో పాల్గొన్నాయి. ఇంత జరుగుతున్నా రానా విరాట పర్వం మేకర్స్ కామ్ గా ఉన్నారు. నావి 80 శాతం థియేటర్స్ మూతపడ్డాయి, థియేటర్స్ లో ఇలాగే టికెట్ రేట్స్ ఉంటే.. నా సినిమాలన్ని ఓటిటిలోనే రిలీజ్ చేస్తాను అని దగ్గుబాటి సురేష్ బాబు అనగానే.. ఇక రానా విరాట పర్వం కూడా ఓటిటిలోనే రిలీజ్ అనుకున్నారు. ఎందుకంటే దృశ్యం, నారప్ప లని సురేష్ బాబు అలాగే ఓటిటికి అమ్మేసారు.
మంచి డీల్ ఉంటే నా సినిమాలు ఓటిటిలోనే అని అనౌన్స్ కూడా చేశారాయన. మరి ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటే.. ఏడాది క్రితమే షూటింగ్ కంప్లీట్ అయ్యి రీలీజ్ కి సిద్దమయిన విరాట పర్వం సినిమాకి ఎప్పుడు మోక్షం కలుగుతుందో మరి.